Woman Stole : కాబోయే భార్య కోటి రూపాయల టోకరా..!

Woman Stole ఆన్ లైన్ మోసాల గురించి నిత్య వార్తల్లో ఎంత అలర్ట్ చేస్తున్నా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఈ ఆన్ లైన్ మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా

Published By: HashtagU Telugu Desk
Woman Stole Crores From Per

Woman Stole Crores From Per

Woman Stole ఆన్ లైన్ మోసాల గురించి నిత్య వార్తల్లో ఎంత అలర్ట్ చేస్తున్నా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఈ ఆన్ లైన్ మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యని అంటూ నమ్మించి అతని బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా కోటిన్నర రూపాయలు కొట్టేసింది. బెంగుళూరులో జరిగిన ఈ సంఘటన అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. బెంగుళూరుకి చెందిన ఒక వ్యక్తి ప్రముఖ కంపెనీలొ HR గా పనిచేస్తున్నాడు. మొదటి భార్య నుంచ్ డైవర్స్ తీసుకున్న అతను మళ్లీ పెళ్లి చేసుకునేందుకు మ్యాట్రిమోనీని లో చేరాడు.

తన ప్రొఫైల్ నచ్చి ఓ డైవర్సీ ఉమెన్ (Woman Stole) అతనితో పెళ్లికి రెడీ అన్నది. మూడు నెలలు చాటింగ్ ఫోన్ సంభాషణలతో అతన్ని ఆమె ముగ్గులోకి దింపుకుంది. ఇక అతనితో చనువుగా ఉంటూ అతని బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుంది. ఆన్ లైన్ ట్రేడింగ్ ఎక్సేంజ్ లో ఇన్వెస్ట్ చేస్తే 12 కోట్లు లాభం వచ్చినట్టు అతన్ని నమ్మించింది. అతనితోని కూడా కోటిన్నర దాకా పెట్టుబడి పెట్టించింది. అయితే డబ్బులు అతని ఖాతా నుంచి వెళ్లిపోయిన తర్వాత నుంచి ఆమె అతనితో టచ్ లో లేదు. ఆ తర్వాత అతను మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

పరిచయం లేని వ్యక్తులకు మన బ్యాంక్ ఖాతాకి సంబంధించిన ఎలాంటి ఇన్ ఫర్మేషన్ ఇవ్వకూడదని సైబర్ పోలీసులు చెబుతూ ఉంటారు. కానీ అమ్మాయి మాట వినగానే వారిపై ఎక్కడలేని నమ్మకం కుదురుతుంది. దాంతో వారిపై నమ్మకంతో వారి డీటైల్స్ అన్నీ చెప్పేస్తారు. ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఏదైనా విషయం జరిగిన తర్వాత కంగారు పడటం కన్నా జరగకముందే జాగ్రత్త పడితే బెటర్.

Also Read : World Rose Day 2023 : ఈరోజు వరల్డ్ రోజ్ డే ..దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

  Last Updated: 22 Sep 2023, 11:07 AM IST