Site icon HashtagU Telugu

Bikini Photo: రెజ్యూమ్‌ లో బికినీ ఫోటో.. జాబ్ ఆఫర్ల వెల్లువ

Woman Bikini Job

Woman Bikini Job

జాబ్ రెజ్యూమ్‌ లో ఎవరైనా వృత్తిపరమైన అనుభవం, హాబీలు, నేపథ్యం గురించి ప్రస్తావిస్తారు.వీటితో పాటు ఒక ప్రొఫెషనల్ ఫోటో యాడ్ చేస్తారు. కానీ బ్రిటన్ యువతి టెడ్డీ స్వాన్ తాను బికినీలో ఉన్న ప్రైవేట్ ఫోటోను జాబ్ రెజ్యుమె లో యాడ్ చేసింది. ఫేస్ బుక్ లో ఈ రెజ్యుమె ను పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఈ బ్రిటన్ యువతి గత 6 వారాలుగా బార్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తోంది.

కానీ ఇప్పుడు మరొక ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఈ కారణంగా తన బికినీ ఫోటో అటాచ్ చేసి.. ‘ఈ కొత్త సంవత్సరంలో నేను కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాను” అని కామెంట్స్ చేసింది. “ఉద్యోగం కోసం నేను ఎక్కడికైనా వెళతా. నాకు సొంత కారు ఉంది. నేను ఇంతకుముందు ఫార్మసీ, రిటైల్, పిల్లల సంరక్షణ నర్సు మరియు అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేశాను” అని రెజ్యుమె లో ప్రస్తావించింది.ఈమె
” బ్యాక్‌ప్యాకర్స్‌” అనే ప్రముఖ
ఫేస్ బుక్ పేజీలో ఈ జాబ్ పోస్ట్ చేసింది. దీన్ని చూసిన జనాలు రెజ్యుమె లో బికినీ ఫోటో పెట్టడం సరికాదు, ఉద్యోగం రాదు అని కామెంట్స్ చేశారు. అయితే ఈ ఫోటో పెట్టాక తనకు వరుస జాబ్ ఆఫర్లు వచ్చాయని ఆమె వారికి బదులిచ్చింది. వచ్చిన జాబ్ ఆఫర్లలో ఒకదాన్ని తాను ఎంపిక చేసుకుంటానని స్పష్టం చేసింది. ఇంతలా స్పందన వస్తుందని తాను ఊహించలేదని పేర్కొంది.

Exit mobile version