Site icon HashtagU Telugu

LinkedIn : జాబ్ ప్రొఫైల్ లో “సెక్స్ వర్క్” ను అనుభవంగా చెప్పిన మహిళ.. లింక్డ్ ఇన్ లో హాట్ డిబేట్!

Linkedin Imresizer

Linkedin Imresizer

జాబ్ ప్రొఫైల్ లో, సోషల్ మీడియా ప్రొఫైల్ లో వర్క్ ఎక్స్ పీరియన్స్ అనే చోట ఓ మహిళ “సెక్స్ వర్క్” అని రాసుకుంది. దీనిపై ఇప్పుడు లింక్డ్ ఇన్ సోషల్ మీడియా సైట్ వేదికగా హాట్ డిబేట్ జరుగుతోంది.
“సెక్స్ వర్క్” ను అనుభవంగా చెప్పుకోవచ్చా ? చెప్పుకోవద్దా ? అనే దానిపై వాడివేడి డిస్కషన్ నడుస్తోంది. ఇంతటి చర్చకు తెర తీసిన ఆ లింక్డ్ ఇన్ ఖాతాదారు పేరు Arielle Egozi. ఆమెకు లింక్డ్ ఇన్ లో 9000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. “సెక్స్ వర్క్” అని రాసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ అరియెల్లి ఎగోజి ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. “నేను రెండు వారాల క్రితమే సెక్స్ వర్క్ ను వదిలేశాను. నా ఇమేజ్ ను అమ్ముకొని వచ్చే డబ్బుల వల్ల సంతోషంగా ఉండలేనని అనిపించింది. నాలోని పనితనాన్ని, సంపాదన పటిమను సెక్స్ వర్క్ నిరూపించింది. సెక్స్ వర్క్ కోసం నేను పెద్ద అమౌంట్స్ ఛార్జ్ చేసేవాణ్ణి. నేను చెప్పే స్థాయిలో పేమెంట్స్ కు ఇష్టం లేని వాళ్ళను రిజెక్ట్ చేసేదాన్ని. సురక్షిత మార్గాల్లోనే సెక్స్ లో పాల్గొనేదాన్ని. ఇతరత్రా క్లయింట్ వర్క్ ల కంటే భిన్నంగా సెక్స్ వర్క్ ను ఎందుకు చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు.ఇప్పుడైతే నాకు కొత్త జాబ్ వచ్చింది” అని Arielle Egozi తన పోస్ట్ లో వివరించింది. ఈ పోస్ట్ కు 8000 రియాక్షన్స్, 1500 కామెంట్స్ వచ్చాయి. ఆమె పోస్ట్ పై ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ” అథ్లెట్స్, సర్కస్ ఫీట్లు చేసేవాళ్ళు, నిర్మాణ రంగ కార్మికులు, మోడల్స్ వాళ్ళ దేహాలకు శ్రమను ఇచ్చి ఆదాయాన్ని సంపాదిస్తారు. మరి Arielle Egozi లాంటి వాళ్ళు శరీరాన్ని వాడుకొని డబ్బు సంపాదిస్తే తప్పేంటి ?” అని వ్యాఖ్యానించారు.

 

https://www.linkedin.com/in/arielle-egozi-31278739

Exit mobile version