Site icon HashtagU Telugu

Wipro: సగం జీతానికే విధుల్లో చేరాలంటూ ఉద్యోగులకు విప్రో ఈ-మెయిల్

Crorepati Employees

Crorepati Employees

ఐటీ సంస్థ విప్రో ఇటీవల తీసుకువచ్చిన హాఫ్ శాలరీ (సగం జీతం) ఆఫర్ విమర్శల పాలవుతోంది. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థలు కొన్ని ఉద్యోగాలకు అనుభవంతో పనిలేకుండా ఫ్రెషర్లను తీసుకోవడం సర్వసాధారణం. విప్రో కూడా ఓ నోటిఫికేషన్ ద్వారా ఫ్రెషర్లను ఉద్యోగంలోకి తీసుకుంది. వారికి వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ సెక్షన్ లో శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు విప్రో సంవత్సరానికి రూ.6.5 లక్షల ప్యాకేజీ ఇస్తామని తొలుత పేర్కొంది. అయితే ఇప్పుడు అందులో సగమే ఇస్తామని విప్రో అంటోంది. అంతేకాదు, సగం జీతానికే విధుల్లో చేరాలంటూ ఫ్రెషర్లకు ఈ-మెయిల్ సందేశాలు పంపింది. దీనిపై ఐటీ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది.