Site icon HashtagU Telugu

WHO : మంకీ పాక్స్ కాదు…Mpox అని పిలవాలి…!!

Monkeypox

Monkeypox

మంకీపాక్స్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి. ఇప్పుడు ఈ వ్యాధిపేరు మార్చేసింది డబ్ల్యూహెచ్ఓ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం మంకీపాక్స్ ను మ్పాక్స్ గా పిలవాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మంకీపాక్స్ వ్యాప్తి చెందినప్పుడు చాలా చోట్ల మంకీపాక్స్ పేరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ వ్యాధి పేరు  మార్చాలంటూ చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ  WHOను కోరాయి. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసిజెస్ ప్రకారం..వ్యాధులకు పేరు పెట్టేందుకు WHOపూర్తి బాధ్యత వహిస్తుదంది. ICD నవీకరణ ప్రకారం…డబ్ల్యూహెచ్ఓ అనేకమంది నిపుణులు, దేశాలు, సాధారణ ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే మ్పాక్స్ గా పేరు మార్చింది.