సాధారణంగా ప్రతి ఒక్క ఇంటిలోనూ బల్లులు ఉండటం సర్వసాధారణం. అయితే కొందరు బల్లులను చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. నిజానికి బల్లులు ఏమంత విషపూరితమైనవి ప్రమాదకరమైనవి కాదు.బల్లుల్లో ఎన్నో రకాల జాతులు ఉంటాయి. అయితే వీటిలో చాలా తక్కువ శాతం మాత్రమే విషపూరితమైనవి. ఇక మన ఇళ్లలో తిరిగే బల్లులు ఏమాత్రం విషపూరితమైనవి కాదు. ఇకపోతే కొన్ని సందర్భాలలో మన ఇంట్లో బల్లులు పొరపాటున మన శరీరంపై పడటం జరుగుతుంది.ఈ విధంగా బల్లి మీద పడితే చాలామంది ఏవేవో మూఢనమ్మకాలను నమ్ముతూ భయం వ్యక్తం చేస్తుంటారు.
ఇలా ఉన్నఫలంగా బల్లి మీద పడింది ఏం కీడు జరగబోతుందో ఏమోనని పదేపదే ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటారు.మరికొందరు వెంటనే పంచాంగం తిప్పడం లేదా పండితుడిని కలిసి పరిహారం అడిగి ఆ పరిహారం పాటిస్తాము. అలాగే మరికొందరు కంచికి వెళ్లిన వారి పాదాలకు నమస్కరిస్తే దోషం పోతుందని చెబుతుంటారు. ఇలా బల్లి మీద పడితే చాలామంది నానా హంగామా చేస్తూ ఉంటారు. అయితే నిజానికి మీద బల్లి పడితే ఏం జరుగుతుంది ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
సాధారణ క్రిమి కీటకాలు మాదిరిగానే బల్లులు కూడా ఒక జాతికి చెందినవే. అయితే అవి మన ఇంట్లో తిరుగుతున్నప్పుడు దాని శరీరంలో పలు మార్పులు కారణంగా శరీరంలో పటుత్వం కోల్పోయి కింద పడుతూ ఉంటాయి. ఇలా అవి పట్టు కోల్పోయినప్పుడే మనపై పడతాయి. ఇలా పడిపోయిన బల్లులను ఏదో కీడుగా భావించి పదే పదే దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకుండా శుభ్రంగా కాళ్లు చేతులు కడుక్కొని ఆ విషయాన్ని అంతటితో మర్చిపోవడం మంచిది. ఇలాంటి విషయాలలో నమ్మకాలు అవసరం కానీ మూడనమ్మకాలు అవసరం లేదని బల్లులు మీద పడటం వల్ల ఏ విధమైనటువంటి దోషం ఉండదని చెప్పాలి.
