Dog Food: మనుషులు తినే ఆహారం కుక్కలకు పెట్టొచ్చా.. వాటికి మంచిదేనా?

మనుషులు ఎక్కువ శాతం ఇష్టపడే జంతువులలో కుక్క కూడా ఒకటి. కుక్క విశ్వాసానికి మారుపేరు అని అంటూ

  • Written By:
  • Publish Date - August 21, 2022 / 07:45 AM IST

మనుషులు ఎక్కువ శాతం ఇష్టపడే జంతువులలో కుక్క కూడా ఒకటి. కుక్క విశ్వాసానికి మారుపేరు అని అంటూ ఉంటారు. ఒకప్పుడు అన్నం పెట్టిన చాలు కుక్క విశ్వాసం చూపిస్తుంది అంటుంటారు. అయితే సాధారణంగా చాలామంది ఇళ్లలో కుక్కలని పెంచుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువగా కుక్కలను ఇంట్లో పెంచుకోవడంతో పాటుగా మనుషులు ఏవి తింటారో వాటిని కూడా కుక్కలకు అలవాటు చేస్తూ ఉంటారు. అయితే అలా చేయడం చాలా ప్రమాదకరమట. మరి మనుషులు తినే ఎటువంటి తిండిని కుక్కలకు, ఎటువంటి ఆహారం పెట్టవచ్చు.. ఎటువంటి ఆహారం పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పుచ్చకాయ: ఎక్కువ శాతం నీళ్లు కలిగిన పుచ్చకాయలో విటమిన్ ఏ,బి6,సి, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఈ పుచ్చకాయలో కేలరీలు పోషకాలు తక్కువగా ఉంటాయి. వేసవికాలంలో కుక్కలకు పుచ్చకాయను తినిపించడం వల్ల అవి దాని శరీరాన్ని చల్లబరుస్తాయి.

బ్లూ బెర్రీ : వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కుక్కలకు కూడా వీటిని ముక్కలు ముక్కలుగా చేసి పెట్టవచ్చు.

ఆపిల్: కుక్కలు కూడా మనుషుల మాదిరిగా ఆపిల్ పండును ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఆపిల్ లో విటమిన్ సి, ఎ, ఫైబర్, ఒమేగా 3, యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అయితే కుక్క యాపిల్ తిన్న పర్లేదు కానీ ఆపిల్ విత్తనాలు తినకుండా జాగ్రత్త పడాలి. లేదంటే అది విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది.

క్యారెట్: కుక్కలకు ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు.

బీన్స్: వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ,సి,కె, పోలిక్ ఆమ్లం, మెగ్నీషియం, క్యాల్షియం, చక్కెర, పొటాషియం లాంటివి అధికంగా ఉంటాయి. కుక్కలకు బీన్స్ తినిపించేటప్పుడు ఉప్పు మసాలా జోడించకూడదు.

వీటితో పాటుగా ఆకుకూరలు, గుమ్మడి గింజలు, చికెన్ ముక్కలు, చికెన్ ఉడికించిన పులుసు, చేపలు ఇవన్నీ కూడా మనుషులు సారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని కుక్కలకు కూడా పెట్టవచ్చు. కుక్కలకు ఎటువంటి ఆహారం పెట్టకూడదు అన్న విషయానికి వస్తే.. ఎండు ద్రాక్ష, ద్రాక్ష, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, చక్కెర కలిగిన పదార్థాలు, తీపి పదార్థాలను పెట్టకూడదు.