Site icon HashtagU Telugu

What if Banks go Bankcrupt?: మనం డబ్బులు దాచుకునే బ్యాంకులు దివాలా తీస్తే?

Banks Open Sunday

What If The Banks Where We Keep Our Money Go Bankrupt..!

డబ్బులు దాచుకుంటే భద్రం. అయితే ఆ బ్యాంకులు (Banks) దివాలా తీస్తే.. ఆ డబ్బులు.. మన పరిస్థితి ఏంటి? ఇటీవల అమెరికాకు చెందిన ఎస్‌వీబీ బ్యాంకు (SVB Bank) దివాళా తీశాక ఈ ప్రశ్న చాలామందికి మదిలో మెదిలింది. మన దేశంలో ఏదైనా బ్యాంకుకు ఇదే పరిస్థితి వస్తే ఖాతాదారుల డబ్బుల సంగతి ఏంటి అనే డౌట్‌ మీకూ వచ్చి ఉంటే.. ఈ వార్తలో మీకు సమాధానం కచ్చితంగా లభిస్తుంది

వినియోగదారుడు బ్యాంకులో దాచుకున్న డబ్బులపై బీమా రక్షణ ఉంటుంది. ఈ సదుపాయం ఖాతాదారులకు ఉచితమే. దీనికి సంబంధించిన ప్రీమియంను బ్యాంకులే చెల్లిస్తాయి. అనుకోని పరిస్థితుల్లో బ్యాంకు మూసేస్తే, లేక ఇంకేదైనా జరిగితే ఆ పరిహారం ఖాతాదారులకు అందుతుంది. అయితే ఆ పరిహారం గరిష్ఠంగా రూ.5 లక్షలు మాత్రమే. అంటే మీరు బ్యాంకులో ఎంత దాచుకున్నా.. మీకు రూ. 5 లక్షలే (అసలు, వడ్డీ కలిపి) వస్తాయి. ఒకే బ్యాంకులోని వివిధ శాఖల్లో ఖాతాలు ఉన్నా.. వాటన్నింటికి కలిపి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే బీమా ఇస్తారు. ఒకే బ్యాంకులో ఎక్కువ ఖాతాలుంటే వాటన్నింటినీ ఒకే ఖాతాగా పరిగణిస్తారు.

DICGC ఆధ్వర్యంలో..

ఈ మొత్తం బీమా ప్రాసెస్‌ను డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) చూసుకుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన DICGC… కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. దేశంలోని అన్ని వాణిజ్య, విదేశీ బ్యాంకుల్లో ఉంచిన డిపాజిటర్ల డబ్బుకు DICGCనే బీమా రక్షణ కల్పిస్తుంది. కేంద్ర, రాష్ట్ర, పట్టణ సహకార బ్యాంకులు (Cooperative Banks), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (Regional Rural Banks), స్థానిక బ్యాంకులు (Local banks) DICGC బీమా కవర్‌ తీసుకోవాలి. బ్యాంకుల్లోని పొదుపు, ఫిక్స్‌డ్‌, కరెంట్‌, రికరింగ్‌ డిపాజిట్‌ వంటి అన్ని డిపాజిట్లపైనా బీమా వర్తిస్తుంది.

బీమా పరిమితి రూ.5 లక్షలు మాత్రమే కాబట్టి అంతకుమించి బ్యాంకుల్లో మదుపు చేయడం రిస్క్ అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అయితే, మీరు రూ.10 లక్షలు మదుపు చేయాలనుకుంటే, అందులో రూ.5 లక్షలు మీ వ్యక్తిగత ఖాతా ద్వారా, మిగిలిన మొత్తాన్ని మీ భార్య/పిల్లల పేరు మీద చేయొచ్చు. అలాగే ఈ బీమా సౌకర్యం జాయింట్ ఖాతాకు కూడా వర్తిస్తుంది.

Also Read:  Biryani ATM: బిర్యానీ ఏటీఎం ఎక్కడైనా చూసారా?