ITI Career Scope : ఐటీఐ కోర్సు అని తీసి పారేయకండి, గవర్నమెంటుతో పాటు విదేశాల్లోనూ ఉద్యోగాలు పొందే చాన్స్…!!

ప్రతి ఏడాది ఎంతో మంది విద్యార్థులు ఐటీఐలో అడ్మిషన్లు పొందుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 09:00 AM IST

ప్రతి ఏడాది ఎంతో మంది విద్యార్థులు ఐటీఐలో అడ్మిషన్లు పొందుతున్నారు. అడ్మిషన్ తీసుకునే ముందు లేదా చదువుతున్న సమయంలో…ఉద్యోగానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు వారిలో మొదలవుతాయి. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత భవిష్యత్తు ఏంటి..అనే సందేహాలు వారి మదిలో మెదులుతుంటాయి. అయితే ఐటీఐ నుంచి కోర్సు చేసిన వారికి ఎన్నో రంగాల్లో ఉద్యోగఅవకాశాలెన్నో ఉన్నాయి.  ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు విదేశాల్లోనూ ఉద్యోగాలు చేయవచ్చు. ఐటీఐ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏ రంగాల్లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

కోర్సును బట్టి ఉద్యోగాలు లభిస్తాయి:
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తుంది. ఇంజనీరింగ్ లో ఆర్కిటెక్చర్ అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్, రేడియాలజీ టెక్నీషియన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఫుడ్ ప్రొడక్షన్, నీడిల్ వర్కర్, డేటా ఎంట్రీ వంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ రెండు వేర్వేరు రంగాలు. కాబట్టి మీరు కోర్సు ప్రకారం ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది.

ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ :
ఆలో ఇండియా ట్రేడ్ టెస్ట్ సహాయంతో ఈజీగా ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. ఈ పరీక్షను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రైనింగ్ ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తుంది. ప్రతిట్రేడ్ కు ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థికి రూ. 50,000బహుమతి కూడా ఇవ్వబడుతుంది.

ప్రైవేట్ సంస్థలు:
ప్రైవేట్ తయారీ సంస్థల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పోస్టులు పడుతుంటాయి. ఇందులో మీ స్కిల్స్ బట్టి ఏ ఉద్యోగానికైనా అప్లయ్ చేసుకోవచ్చు. ఐటీఐ చదివిన తర్వాత మెకానిక్ కంపెనీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

విదేశాలకు వెళ్లేందుకు:
ఐటీఐ తర్వాత విదేశాల్లో ఉద్యోగాలకు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో మానుఫ్యాక్ఛరింగ్ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతారు.

ప్రభుత్వ ఉద్యోగాలు:
1. ప్రతిఏటా ఎంతో మందిని రైల్వే బోర్డు రిక్రూట్ చేసుకుంటుంది. అందులో ఐటీఐ సర్టిఫికేట్ కు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఇవే కాకుండా ఐటీఐ సర్టిఫికేట్ పొందిన అభ్యర్థలు సీఆర్పీఎఫ్, ఇండియన్ నేవీ, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు కూడా రిక్రూట్ చేసుకుంటాయి.
2. ఇక జూనియర్ స్థాయి ఉద్యోగాలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. ఉదాహరణకు రేడియాలజీ టెక్నీషియన్ కోర్సు చేస్తున్నవారు ఏదైనా ల్యాబ్ లో అసిస్టెంట్ స్థాయి ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చు.

3. నాన్ ఇంజనీరింగ్ కోర్సు తర్వాత సూపర్ మార్కెట్, హోటల్, కుట్టు ఎంబ్రాయిడరీ వంటి ఉద్యోగాల్లో చేరవచ్చు.