Site icon HashtagU Telugu

Bike Driving: వాట్ ఏ డ్రైవింగ్.. యువకుడి ‘బైక్ రైడింగ్’ వీడియో వైరల్!

Viral

Viral

ఈ కాలం మనుషులు థ్రిల్ కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా ముందుంటారు. ఈ క్రమంలో బైక్ రైడర్లు, సైక్లిస్ట్‌లు, పారా జంపర్లు చాలామంది డిఫరెంట్ స్టంట్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో చూశాం. ప్రమాదకరమైన స్టంట్స్ చేేసిన విషయం కూడా తెలిసిందే. అందుకే కొంతమంది ఎప్పుడూ చేయని రిస్క్ స్టంట్స్ చేస్తుంటారు. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి కూడా రిస్క్ తో కూడిన  బైక్ రైడింగ్ చేశాడు. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డాడు.

ఒక యువకుడు చొక్కా లేకుండా బైక్ డ్రైవింగ్ చేసిన ద్రుశ్యాన్ని వీడియోలో చూడొచ్చు. ఓ చిన్నపాటి చెరువులోని నీళ్లపై ప్లాస్టిక్ డ్రమ్స్ అమర్చుతారు. ఆ యువకుడు మితిమీరిన వేగంతో వాటిపై డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. కానీ తన ఫీట్ ను సక్సెస్ గా కంప్లీట్ చేసినా ప్రమాదం బారిన పడలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.