Anna Mani: ప్రముఖ భారత వాతావరణ మహిళగా పిలుచుకుంటున్న అన్నామణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత తొలితరం మహిళ శాస్త్రవేత్తలో ఈమె ఒకరు. ఇక ఈరోజు ఆమె 104వ జయంతి సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్నామణి కేరళలోని పీరమేడ్ గ్రామంలో 1918లో జన్మించారు.
ఇక ఈమెకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. ఒకసారి తన తల్లిదండ్రులు ఆమె 8వ పుట్టిన రోజున తనకు వజ్రాల చెవి పోగులు బహుమతిగా ఇస్తే వాటిని కాదని ఎన్సైక్లోపిడియా బ్రిటానిక పుస్తకం కావాలని పట్టుబట్టారట. ఇక తన 12 ఏళ్ల వయసులో ఒక ప్రాంతంలో ఉన్న లైబ్రరీలో పుస్తకాలన్నింటిని చదివారట.
Anna Manii
తమది సాంప్రదాయమైన కుటుంబం కావడంతో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన అది పక్కన పెట్టి ఇంట్లో వారితో పట్టుబడి ఉన్నత చదువులు చదివారట. అలా డిగ్రీ పూర్తి చేశారట. ఆ తర్వాత కొంతకాలం రూబీ, వజ్రాల్లో పరిశోధనలు కూడా చేశారట. ఈమె పీహెచ్ డీ కోసం మాస్టర్స్ చేయాలని లండన్ ఇంపీరియల్ కాలేజీకి వెళ్లారట. అక్కడికి వెళ్ళాక తనకు వాతావరణం శాస్త్రం పట్ల ఆసక్తి పెరగటంతో.. వాతావరణ శాఖ పరికరాల విభాగంలో స్పెషలైజేషన్ పూర్తి చేశారు.
అలా భారత్ కి తిరిగి వచ్చి పూణేలో వాతావరణ శాఖలో చేరారట. ఇక గాలి వేగం, సౌర విద్యుత్తును కొలిచేందుకు తయారు చేసే పరికరాలతో వర్క్ షాపు కూడా ఏర్పాటు చేశారట. అలా ఆ తర్వాత ఆమె చేసిన సేవలకు ఆమెను వెదర్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా వర్ణించారట. ఇక వివాహ బంధానికి దూరంగా ఉండి 1976లో డిప్యూటీ జనరల్ గా పదవి విరమణ పొందారు. ఇక 2001లో అనారోగ్య సమస్యతో మరణించారు.
