Flying Car Video: గాల్లో చక్కర్లు కొట్టిన ఫ్లయింగ్ కారు.. వైరల్ అవుతున్న వీడియో!

త్వరలో ఫ్లయింగ్ కార్లు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ట్రయల్ రన్స్ నిర్వహించాయి కూడా.

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 04:38 PM IST

త్వరలో ఫ్లయింగ్ కార్లు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ట్రయల్ రన్స్ నిర్వహించాయి కూడా. ట్రాఫిక్ సమస్యలు, ఇతర సమస్యల కారణంగా ధనవంతులు ఫ్లయింగ్ కార్లను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లకు తన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పరిచయం చేసే చైనీస్ ఎలక్ట్రానిక్ వాహన తయారీదారు ఎక్స్‌పెంగ్ ఇంక్ ‘ఫ్లయింగ్ కార్’ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ట్రయల్ రన్ నిర్వహించింది.

రెండు-సీటర్ ఎలక్ట్రిక్ VTOL ఎయిర్‌క్రాఫ్ట్, X2 ఎనిమిది ప్రొపెల్లర్ల ద్వారా ఆకాశంలో దూసుకెళ్లింది. చూసేందుకు కారు అయినా అచ్చం విమానంలా ఉంది. దీని గరిష్ట వేగం, కంపెనీ ప్రకారం, 130 km/h (80 mph). రెండు సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణీకులను డ్రైవర్ లేని కార్లలో, రద్దీగా ఉండే రోడ్లపై పట్టణం చుట్టూ జర్నీ చేయవచ్చు. అయితే బ్యాటరీ లైఫ్, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, భద్రతను పరిగణనలోకి తీసుకొని మార్పులు చేయాల్సి ఉంటుంది.