Site icon HashtagU Telugu

Vishakha mayor: శభాష్ విశాఖ మేయర్ : సొంత వాహనం వదిలి.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ!

Mayar

Mayar

ఆమె ఓ మేయర్.. అధికారిక వాహనంలో ప్రయాణిస్తూ ఎంచక్కా తన విధులను నిర్వహించుకోవచ్చు. కానీ సొంత వాహనం పక్కన పెట్టి, సెక్యూరిటీ కూడా నో చెప్పి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల్లో స్పూర్తిని నింపుతోంది. గవర్నమెంట్ జాబ్ అంటే అధికారాలను అనుభవించడం కాదు.. సాధారణంగా బతికేయొచ్చని నిరూపిస్తోంది. ఆమె ఎవరో ఎవరో కాదు.. విశాఖ మేయరు గొలగాని హరి వెంకట కుమారి! ప్రతి సోమవారం వాహన రహితం కార్యక్రమంలో భాగంగా ఆమె పెదగదిలి నుంచి ఆర్టీసీ బస్సులో కాంప్లెక్స్‌ వరకు ప్రయాణించి జీవీఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్‌ లక్ష్మీశ క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాన కార్యాలయానికి నడుచుకుంటూ వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో మేయర్, కమిషనర్‌ ప్రయాణించారు. అధికారులు కార్లను వినియోగించకుండా ప్రజారవాణా ద్వారా కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు.

Exit mobile version