Site icon HashtagU Telugu

Virat Kohli Cutout: దటీజ్ కోహ్లీ.. సుదర్శన్‌ థియేటర్‌ వద్ద భారీ కటౌట్‌

Kohli

Kohli

క్రికెట్ దేవుడు అనగానే చాలామందికి గుర్తుకువచ్చే మొదటి పేరు సచిన్ టెండూల్కర్. ఎన్నో ఏళ్లుగా ఆ పేరు మార్మోగింది. సచిన్ రిటైర్ మెంట్ తర్వాత ‘ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’ అనేది క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం. కానీ వాళ్లందరి అభిప్రాయం తప్పంటూ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి రికార్డుల మీదు రికార్డులు తిరుగరాస్తున్నాడు విరాట్ కోహ్లీ.

పరుగుల రారాజు.. రికార్డుల యోధుడు.. ఛేదనలో మేటి.. ఇలా అతడి ఆటతీరు గురించి ఎంతగా వర్ణించినా సరిపోదేమో..! రికార్డులను బ్రేక్‌ చేస్తూ.. క్రికెట్‌ ప్రపంచంలో కొత్త చరిత్రను లిఖిస్తున్న ‘కింగ్’ విరాట్‌ కోహ్లీ పుట్టిన రోజు నేడు. పొట్టి ప్రపంచ కప్‌ నేపథ్యంలో ఈ రోజును అతడి అభిమానులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఈ సందడి కనిపించింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్‌ 35 ఎంఎం థియేటర్‌ ముందు కోహ్లీ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Exit mobile version