Viral Video: తమ్ముడిని క్యాచ్ పట్టిన అన్నయ్య.. చచ్చేవాడు బతికాడు!

కాలు జారి కింద పడితేనే ఎన్నో గాయాలు అవుతాయి. కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది.

Published By: HashtagU Telugu Desk
Viral Imresizer

Viral Imresizer

కాలు జారి కింద పడితేనే ఎన్నో గాయాలు అవుతాయి. కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అలాంటిది ఓ వ్యక్తి ఇంటిపై భాగంలో శుభ్రం చేస్తుండగా.. పట్టుతప్పి ఏకంగా కిందపడిపోయాడు.ఇంకేమైనా ఉందా? అతడి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.

అతగాడిని రక్షించడం అపర బ్రహ్మతరం కూడా కాదని భావించారు. ఇంతలో అద్భుత చమత్కారం జరిగింది. అతడు సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందబ్బా అనుకుంటున్నారా? మరేం లేదు.. ఇంటిపై భాగం నుంచి ఆ వ్యక్తి పడిపోయిన సమయంలో కింద వరండాలో అతడి సోదరుడు నిలబడి ఉన్నాడు.కింద పడిపోతున్న తన తోబుట్టువును కాపాడకుండా ఎలా చూస్తుండగలడు. వెంటనే పరుగున వచ్చి తన సోదరుడిని క్యాచ్ చేశాడు. సురక్షితంగా కిందికి దింపాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలోని మలప్పురంలో జులై 31న చోటుచేసుకుంది.

ఈ ఘటనలో పైనుంచి పడిన వ్యక్తి పైకిలేచి మాములుగా కనిపించగా.. అతని అన్న మాత్రం కాసేపటికి పైకి లేచాడు. ఆ అన్న గమనించక పోయినా.. స్పందించకపోయినా ఆ తమ్ముడికి కచ్చితంగా ఏదో తీవ్ర గాయం అయ్యి ఉండేది. ఇటువంటి వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. అత్యధిక వ్యూస్, లైక్స్ పొందుతున్నాయి. ఈ వీడియో కు కూడా భారీగానే లైక్స్, వ్యూస్ వచ్చాయి. ఎంతోమంది షేర్ చేశారు. ఆ అన్నయ్య వచ్చి పట్టుకోకుంటే.. తమ్ముడి సంగతి అంతే అయి ఉండేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

  Last Updated: 05 Aug 2022, 02:05 AM IST