Site icon HashtagU Telugu

Viral Video: ఈ కోతులు చేసే పని చూస్తే షాక్ అవ్వాల్సిందే.. అచ్చం మనుషుల్లానే?

Viral Video

Viral Video

Viral Video: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ప్రపంచంలో జరిగే సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు రోజుకు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా కోతులు మన చేతుల్లో ఏమైనా ఉంటే వాటిని లాక్కెలడం మనం చూస్తుంటాం. అయితే ఒక వ్యక్తి ఫోన్లో కోతులకు సంబంధించిన వీడియోను కోతులకు చూపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో భాగంగా ఒక వ్యక్తి తన ఫోన్ లో కోతులకు సంబంధించిన వీడియోని ఆన్ చేసి నిజమైన కోతులకు చూపించారు. అయితే సెల్ ఫోన్ లోపల కోతులు కదులుతుండడం చూసిన నిజమైన కోతులు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ క్రమంలోనే సెల్ ఫోన్ లో కోతులను చూసిన నిజమైన కోతులు వాటిని తాకాలని ప్రయత్నం చేసిన వాటిని తాకలేకపోయాయి. ఇలా రెండు చిన్న కోతులు చూస్తుండగా మరొక పెద్ద కోతి కూడా అక్కడికి చేరి సెల్ ఫోన్ లోపల ఉండే కోతులను తాకాలని ప్రయత్నం చేసింది.

 

అయితే ఈ కోతులు లోపల ఉన్న కోతులను తాకలేకపోవడంతో కాస్త నిరాశ చెందినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోని క్వీన్ ఆఫ్ హిమాచల్ అనే ట్విట్టర్ యూజర్ నుంచి షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోని 126 K మంది చూడగా 670 మంది ఈ వీడియోకి రిప్లై ఇచ్చారు.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

Exit mobile version