Site icon HashtagU Telugu

Chimpanzee in Jeans Kisses Woman: జీన్స్ వేసిన చింపాంజీ.. మహిళపై ముద్దుల వర్షం.. యాక్షన్ మాములుగా లేదుగా!

Video Viral

Video Viral

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. కానీ అందులో కొన్ని వీడియోలు మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటివే తెగ వైరల్ అవుతుంటాయి. అందులో జంతువులకే సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడు వైరల్‌గా మారిన ఓ వీడియోను చూస్తే మీరు కూడా వావ్ అనాల్సిందే. ఎందుకంటే.. జీన్స్ ప్యాంట్‌ ధరించిన చింపాజీ.. ఓ మహిళపై ముద్దుల వర్షం కురిపించింది. ఫొటోలకు బాగా ఫోజులిచ్చింది. ఈ వీడియో చూస్తే చింపాంజీలు ఇలాంటివి కూడా చేస్తాయా అనిపించక మానదు.

వివరాలు.. సౌమియా చంద్రశేఖరన్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో సఫారీ వరల్డ్‌ను సందర్శించి చింపాంజీతో ఫోటోషూట్ చేశారు. అందుకు సంబంధించి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇప్పటివరకు ఆ వీడియోకు 5.5 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్, 266,565 లైక్‌లు వచ్చాయి.

వైరల్ వీడియోలో ఏముందంటే.. అక్కడ రెండు ఊయలలు ఉండగా.. ఒకదానిలో మహిళ కూర్చున్నారు. పక్కన ఉన్న మరో ఊయలలో జీన్స్ ధరించిన చింపాంజీని ఉంది. అది ఉయలపై నిలబడి.. మహిళ భుజంపై చేతులు వేస్తూ ఫోటోలకు సూపర్‌గా ఫోజులిచ్చింది. తర్వాత అక్కడ ఇన్‌స్ట్రక్టర్ చెబుతున్నట్టుగా మహిళ చెంపె పదే పదే ముద్దులు ఇవ్వసాగింది. అంతేకాకుండా ఎంతో ప్రేమగా మహిళ చేతిని కూడా ముద్దాడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.

Exit mobile version