Dead Couple Wedding: 30 ఏళ్ల కిందట మరణించిన వధూవరులు.. ఇప్పుడు పెళ్లి చేసిన కుటుంబీకులు?

సాధారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. కాలం ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు పరుగులు తీస్తున్నప్పటికీ

  • Written By:
  • Publish Date - August 1, 2022 / 08:45 AM IST

సాధారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. కాలం ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు పరుగులు తీస్తున్నప్పటికీ కొందరు మాత్రం వారి ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ఒక్కో ప్రాంతం వాళ్లు ఒక్కో విధమైన ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే మనం ఏ పెళ్లిళ్లకు వెళ్లిన వధూవరుల గురించి మాట్లాడుకోవడం చూస్తుంటాము. అయితే మీరు ఎప్పుడైనా వధూవరులు లేకుండానే పెళ్లి జరగడం చూశారా? అది కూడా చనిపోయిన 30 సంవత్సరాలకు పెళ్లి చేసే ఆచార సంప్రదాయం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.

తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు చెందిన ఓ ప్రాంతంలో ఇలాంటి పెళ్లి వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లికి హాజరైన ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఈ పెళ్లికి సంబంధించిన విషయాలను అందరితో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాను ఒక వివాహానికి హాజరయ్యానని అయితే ఆ వివాహంలో వధూవరులు 30 సంవత్సరాల క్రితమే మరణించారని వెల్లడించారు. ఈ విధంగా వధూవరులు 30 సంవత్సరాల క్రితమే మరణించినప్పటికీ ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా వారికి వివాహం చేశారు.

ఈ విధంగా పుట్టిన వెంటనే శిశువు మరణించిన, ఆ శిశువు 30 సంవత్సరాలు తర్వాత పుట్టిన వెంటనే మరణించిన మరొక శిశువుతో వివాహం జరిపిస్తారు. ఇలా వారి ఆత్మలకు ఇరుకు కుటుంబ సభ్యులు సాంప్రదాయ బద్ధంగా పెళ్లి వేడుకను జరపారని ఈ సందర్భంగా ఈ నెటిజన్ వెల్లడించారు. ఇలా చిన్నప్పుడే మరణించిన ఇరువురు కుటుంబ సభ్యులు ముందుగా ఈ వివాహ వేడుక గురించి మాట్లాడుకుని నిశ్చితార్థం జరుపుకుంటారని అలాగే పెళ్లి వేడుకలో ఒకరికొకరు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి బట్టలు ఇచ్చుపుచ్చుకోవడం, ఏడడుగులు నడవడం అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా జరిగాయని వెల్లడించారు.ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే ఈ పెళ్లికి పెళ్లి కానీ యువతి యువకులు అలాగే చిన్నపిల్లలు అనుమతి లేదు. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇలాంటి సాంప్రదాయాన్ని అక్కడి ప్రజలు ఆచరిస్తారనీ చెప్పాలి.