Site icon HashtagU Telugu

Video Viral: నెటిజన్స్ కి నవ్వులు తెప్పిస్తున్న మేకలు.. ఏం చేసాయంటే?

Viral Video

Viral Video

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రపంచంలో ఏం జరిగినా కూడా కొద్ది క్షణాల్లోనే ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతూ ఉంటుంది. దీంతో ప్రపంచంలో ఏం జరిగినా కూడా తెలుసుకోగలుగుతున్నారు. అలా సోషల్ మీడియాలో నిత్యం జంతువులకు పక్షులకు సంబంధించిన అనేక రకాల ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోలు కొన్ని నవ్వులు తెప్పించేవిగా ఉంటాయి. మరికొన్ని మనసుకు బాధ కలిగించే విధంగా ఉంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో నెటిజన్స్ కి తెగ నవ్వులు తెప్పిస్తోంది. అయితే సాధారణంగా మనకు గొర్రెలు, మేకలు కొంచెం భయం గా ఉంటాయి. తెలియని వ్యక్తులు కొత్త మనుషులు వాటి దగ్గరికి వెళితే అవి బిత్తరపోయి ఉరుకుతాయి. కానీ ఈ వీడియోలో ఈ మేకలు చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఒక ఇంటికి ఆవరణలో నాలుగు మేకలు ఉన్నాయి. అవి ఏదో ఆహారం తింటూ ఉండగా ఇంతలోనే ఒక యూపీఎస్ పార్సెల్ ట్రక్ అటుగా వెళ్ళింది.

అయితే ఆ ట్రక్ డ్రైవర్ కొంచెం సరిగా డ్రైవింగ్ చేయకపోయి సరికి ఆ మేకలు ఉన్న ఫెన్సింగ్ చివర్న కొంచెం టచ్ అయింది. కానీ ఆ మేక పిల్లలకు మాత్రం ఏమీ కాలేదు. కానీ ఆ మేక పిల్లలు మాత్రం సడన్గా నలుగు కింద పడిపోయి చనిపోయినట్టుగా నటించి వాటి కాళ్లు పైకి ఎత్తి గడ్డ కట్టిన శవాల లాగా ఉండిపోయాయి. అయితే ఆ మేకలు అట్టకు గుద్దడం వల్లే చనిపోయాయి అన్న విధంగా యాక్టింగ్ చేశాయి. దీంతో నెటిజెన్స్ ఆ వీడియోని చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఆ మూగ జీవాలకు అన్ని తెలివితేటలు ఎక్కడ నుండి వచ్చాయి అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.