Site icon HashtagU Telugu

Bride On Bullet: బుల్లెట్టు బైకెక్కి వచ్చేత్తప్ప.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని!!

Bride On Bullet Imresizer

Bride On Bullet Imresizer

“బుల్లెట్టు బైకెక్కి వచ్చేత్తప్ప .. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని” అని ఇటీవల ఓ జానపద గీతం వైరల్ అయింది. దానికి ఎంతగా క్రేజ్ వచ్చిందంటే.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి నోట్లో ఆ సాంగ్ నానింది.

మీరు ఈ వీడియోలోనూ ఓ అమ్మాయి అచ్చం పెళ్లి కూతురిలా తయారై.. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై
డుగ్గు డుగ్గుమంటూ సవారైన దృశ్యాన్ని చూడొచ్చు. మేకప్ ఆర్టిస్ట్ దీపాళి ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. ఇందులో కనిపిస్తున్న పెళ్లి కూతురి పేరు వైశాలి చౌదరి. ఢిల్లీ వాస్తవ్యురాలు. ఈ వీడియో ను పోస్ట్ చేసిన వెంటనే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

హెవీ లహేంగా ధరించి.. ఆభరణాల మేకప్ లో మెరిసిపోతూ.. ఆత్మవిశ్వాసం తో .. ఫుల్ కంట్రోల్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను పెళ్లి కూతురు నడిపిన తీరుకు నెటి జన్స్ ఫిదా అవుతున్నారు. అందుకే ఈ వీడియోకు ఇప్పటివరకు 85వేలకు పైగా లైక్స్, 372 కామెంట్స్ వచ్చాయి.

పెళ్లి రోజున .. పెళ్లి వేదిక దాకా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై రాయల్ గా వెళ్లాలనే తన కోరికను నెరవేర్చుకునేందుకు వైశాలి చౌదరి ఇలా చేశారంట. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత అభిరుచుల్లో జరుగుతున్న మార్పులకు ఇలాంటి ఆసక్తికర అంశాలు ఒక నిదర్శనం.