Site icon HashtagU Telugu

Snake Massage: కొండచిలువతో కొత్త రకం మసాజ్.. ఎక్కడో తెలుసా?

Python Massage

Python Massage

సాధారణంగా మనం జర్నీ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పని చేసినప్పుడు, స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు రిలీఫ్ కోసం చాలామందిమసాజ్ చేయించుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మామూలుగా బయట ఉండే మసాజ్ సెంటర్లోకి వెళ్ళగా మరికొందరు మాత్రం మసాజ్ చేయడంలో నిపుణులు అయిన మసాజర్స్ దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మసాజ్ ను చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది చేతులతో మరి కొంతమంది చిన్న చిన్న మిషన్లతో చేస్తూ ఉంటారు. కానీ ఫిలిప్పీన్స్‌ లోని ఒక మసాజ్ సెంటర్ లో మసాజ్ చేయించుకోవాలి అంటే బోలెడు ధైర్యం కావాల్సిందే. ఒకవేళ అతిగా భయపడే వాళ్ళు ఉంటే ఒకసారి గా గుండె ఆగినంత పని అవుతుంది.

మరి ఆ మసాజ్ అంత భయంకరంగా ఉంటుందా అంటే అవును అని చెప్పవచ్చు. అది ఆ మసాజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫిలిప్పీన్స్‌ లోని సెబూ సిటీ జూ సందర్శకులకు ఫ్రీగా మసాజ్‌ సర్వీస్ అందిస్తోంది. జూ అంతా తిరిగి అలసిపోయిన సందర్శకులకు ఫ్రీగా మసాజ్‌ సర్వీస్ అందిస్తోంది. 250 కిలోల బరువుండే భారీ బర్మీస్ కొండచిలువలతో ఉచిత మసాజ్‌ సెంటర్‌ నడుపుతున్నారు. అయితే అక్కడ మసాజ్ చేయించుకోవాలీ అనుకునే వాళ్లు ఆ సెంటర్ నిర్వాహకులు చెప్పే సూచనలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. కస్టమర్‌ను చాపపై పడుకోబెట్టి నాలుగు కొండచిలువలను వదులుతారు. 15 నిమిషాల పాటు కొండచిలువలు కస్టమర్‌పై తిరుగుతూ మసాజ్‌ చేస్తాయి.

కొండచిలువలు మసాజ్ చేస్తున్నంతసేపు గాలిని బలంగా వదలకూడదని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఒకవేళ భయం వేసినా కొండచిలువలు ఒంటిని చుట్టేసినా నిర్వాహకులను నెమ్మదిగా పిలవాలే తప్ప గట్టిగా అరవకూడదు. అరిస్తే ఆ కదలికలను ఆహారంగా భావించి కొండచిలువలు ఊపిరాడకుండా చుట్టేస్తాయి. మసాజ్‌ చేస్తున్నంతసేపు ఎలాంటి కదలికలు లేకుండా పడుకోవాలి. మసాజ్‌ చేసే కొండచిలువలు ఎలాంటి హాని తలపెట్టవని అంటున్నారు నిర్వాహకులు. మసాజ్‌కి ముందు ఒక్కో కొండచిలువకు 10 కోళ్లను ఆహారంగా అందిస్తారు. దీంతో వాటికి ఆకలిగా ఉండదని పైగా కొండచిలువలు విషపూరితం కాదు కాబట్టి ఎలాంటి ప్రాణభయం ఉండదంటున్నారు నిర్వాహకులు. మసాజ్‌ చేయించుకోవడానికి ముందు భయపడ్డ కస్టమర్లు మసాజ్‌ పూర్తయ్యాక భలే మజాగా ఉందంటున్నారు.