Life Struggles: ఎందరికో ఉపాధి.. మరేందరికో ఆమె కథ స్ఫూర్తి.. ఈ వ్యాపార కథ తెలుసుకోండిలా!

ప్రస్తుత కాలంలో చాలామంది లక్షల శాలరీ వస్తున్న ఉద్యోగాలను చేయడం ఇష్టం లేక వదిలేసి, సొంతంగా వ్యాపారాలను

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 01:20 PM IST

ప్రస్తుత కాలంలో చాలామంది లక్షల శాలరీ వస్తున్న ఉద్యోగాలను చేయడం ఇష్టం లేక వదిలేసి, సొంతంగా వ్యాపారాలను మొదలుపెట్టి ఎంతో మందికి జీవితాలు ఇస్తున్నారు. అలాంటి వారిలో గుజరాత్ కి చెందిన వైశాలీ మెహతా ఒకరు. కాగా ఒకప్పుడు ఈమె సాధారణ ఉద్యోగిని. అందరిలాగే ప్రతిరోజూ కూడా ఉద్యోగానికి వెళ్లి పని చేసుకునేది. అయితే కొత్తగా పెళ్లైన ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. అదే విషయం బెంగళూరులో ఆమె పనిచేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ చెప్పగా సదరు కంపెనీ ఆమెను అవమానించిందట. ఉద్యోగంలో చేరిన 3 నెలలకే చేస్తున్న విభాగం నుంచి ఆమెను ట్రావెల్ విభాగానికి షిఫ్ట్ చేసిందట.

అందుకు గల కారణం ఆ కంపెనీ పెద్ద కుట్రే పన్నింది. ట్రావెల్ విభాగంలో కంటిన్యూగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి విభాగం తనకు ఏమాత్రం మంచిది కాదు. కానీ కంపెనీ కావాలనే అందులోకి మార్చడంతో ఇక అక్కడ పనిచేయడం కరెక్టు కాదనుకున్న వైశాలీ ఆ కంపెనీకి గుడ్‌ బై చెప్పిందట. అయితే ముంబైలో ఎంబీఏ చదివిన ఆమె ఉద్యోగం మానేసిన తర్వాత ఎలా అయిన తన మార్క్ ని చూపించుకోవాలి అనుకుంది. ఈ క్రమంలోనే ఒకసారి న్యూయార్క్‌లో సిరప్‌లను రుచి చూసింది వైశాలీ.

అవి ఆమెకు బాగా నచ్చడంతో అటువంటివి ఇండియాలో కూడా లభిస్తాయని తెలుసుకున్న ఆమె ఇండియాకు వచ్చిన తర్వాత అవి తెప్పించుకోగా వాటి రుచి ఆమెకు నచ్చలేదు. అయితే ఇండియాలో సిరప్ లలో రసాయనాలు ఎక్కువగా ఉన్నాయని కానీ వాటిని సహజమైన సిరప్ లు కావాలి అనుకున్న వైశాలకి అదే మొదటి అడుగు అయింది. 2017లో సొంతంగా సిరప్ లాంటిది తయారుచేసింది. అది ఆమెకే నచ్చలేదు. దాంతో ఇదేమీ చిన్న విషయం కాదనీ దాని పై లోతైన అధ్యయనం జరగాలి అని అనుకుంది. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటూ పరిశోధనలు, ప్రయోగాలూ చేసింది. రకరకాల సిరప్‌లను తయారుచేసింది. అలా చివరకు అనుకున్న టేస్ట్ వచ్చింది. అది కంపెనీ ప్రారంభానికి దారితీసింది.