Site icon HashtagU Telugu

Feast: కోడిపుంజు పది రోజుల కర్మకు 500 మందికి భోజనాలు.. ఎక్కడో తెలుసా?

Cock

Cock

సాధారణంగా మనుషులు ఇంట్లో ఎన్నో రకాల జంతువులను పక్షులను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది వాటికి చిన్న గాయమైన ఏదైనా కూడా వెంటనే జంతువు,ఆసుపత్రి పశువుల ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి వారికి చికిత్సలు కూడా చేయిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే వారి పెంపుడు జంతువులు,పక్షులు చనిపోతే వాటికి మనుషుల మాదిరికి అంతక్రియలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది అయితే చనిపోయిన జంతువులు పక్షులకు సమాధులు కూడా కట్టిస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

అయితే ఈ వార్త తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అసలేం జరిగిందంటే..తమ పెంపుడు కోడిపుంజుకు దశదినకర్మ నిర్వహించడమే కాకుండా 500 మందికి భోజనాలు కూడా పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఒక కుటుంబం ఒక కోడిపుంజును పెంచుకుంటోంది. ఒకరోజు వారు పెంచుకుంటున్న ఒక నెల వయసున్న గొర్రె పిల్లను అది కాపాడింది. ప్రాణాలకు తెగించి, ఊరకుక్కల బారి నుంచి కాపాడింది. ఈ క్రమంలో అది తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.

అయితే దాని త్యాగం, ప్రేమ ఆ కుటుంబాన్ని కలచివేసింది. దీంతో అచ్చం మనిషికి ఎలా అయితే మనిషికీ అంత్యక్రియలు చేస్తారో నా కోడిపుంజుకు కూడా అదే విధంగా అంతక్రియలు నిర్వహించారు. అంతేకాదు, దాని ఆత్మకు శాంతి చేకూరాలని దశదినకర్మ అనగా పది రోజుల కర్మను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది వరకు హాజరయ్యారు. అందరికీ ఆ కుటుంబం భోజనాలు పెట్టింది.

Exit mobile version