Site icon HashtagU Telugu

UP CM feeds leopard Cub: చిరుత పిల్లకు పాలు పట్టించిన సీఎం యోగి, వీడియో వైరల్

Up Cm

Up Cm

ఇటీవలనే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అంతరించిపోతున్న చీతాలను ఇండియాకు రప్పంచి, జూలో వదిలిన విషయం తెలిసిందే. తాజాగా యూపీ సీఎం కూడా చిరుత పిల్లలను జూలో వదిలిపెట్టి వార్తాల్లో నిలిచారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిరుతపులి పిల్లకు పాలు తాగిపిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ ఘటన బుధవారం గోరఖ్‌పూర్‌లోని జూలో చోటుచేసుకుంది. వీడియోలో, సీఎం యోగి ఆదిత్యనాథ్ చిరుత పిల్లను తన చేతిలోకి తీసుకొని పాలు పట్టించడం కనిపించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్ తెల్లపులి, రెండు హిమాలయ కృష్ణ ఎలుగుబంట్లు విడుదల చేశారు. జూ ఆస్పత్రిలో ఉన్న రెండు చిరుతపులి పిల్లలకు భవానీ, చండీ పేర్లు కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ పెట్టారని చెబుతున్నారు.

Exit mobile version