Site icon HashtagU Telugu

Zelensky : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు..!!

Zelensky

Zelensky

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ…రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. ఈ ఉదయం జరిగిన ఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. జెలెన్ స్కీ కాన్వాయ్ రాజధాని కీవ్ గుండా ప్రయాణిస్తుండగా…ఎదురుకుగా వస్తున్న ప్యాసింజర్ కారు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనతో వెంటనే తేరుకున్న సిబ్బంది అధికారులు జెలెన్ స్కీని ఆయన కారు డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు.

కాగా తీవ్ర గాయాలేమీ కాలేదన నిర్దారించారని ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది. సాధారణ ప్రమాదామా…లేదంటే ఏదైనా కుట్రకోణమా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. బుధవారం రాత్రి జెలెన్ స్కీ టీవీలో మాట్లాడారు. ఖార్జివ్ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లినట్లు ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని తమ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఈ ప్రమాదం జరిగింది.