Site icon HashtagU Telugu

Father – Son – Sperm : భార్యను ప్రెగ్నెంట్ చేసేందుకు.. తన స్పెర్మ్‌ను తండ్రి స్పెర్మ్‌తో కలిపాడు

Sperm

Sperm

Father – Son – Sperm : అతగాడు ఐవీఎఫ్ (IVF) ద్వారా తన భార్యకు సంతాన సౌభాగ్యాన్ని పొందాలని భావించాడు. కానీ కాలం కలిసి రాలేదు. చేతిలో డబ్బులు లేవు.  దీంతో మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించాడు. తన భార్య గర్భం దాల్చేందుకు తన వీర్యం(స్పెర్మ్)తో  తండ్రి వీర్యాన్ని కలిపాడు. ఇలా మిక్స్ చేసిన వీర్యాన్ని వైద్య నిపుణుల ద్వారా ఆ వ్యక్తి తన భార్యలోకి ప్రవేశపెట్టాడు. ఈ విధమైన ప్రక్రియ ద్వారా ఒక మగశిశువు జన్మించాడు. అలా పుట్టిన బాలుడి వయసు ఇప్పుడు ఐదేళ్లు. ఈ తరహా సంతానోత్పత్తి ఇంగ్లండ్‌లోని ఓ నగరంలో జరిగిందని పేర్కొంటూ ‘ది గార్డియన్’ సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది.చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఇలా సంతానం పొందినవారి పేర్లను వార్తా కథనంలో బహిర్గత పర్చలేదు.  కోర్టు నుంచి అనుమతులు పొందిన తర్వాతే ఈమేరకు తండ్రి, కొడుకుల వీర్యాన్ని కలిపి(Father – Son – Sperm) సంతానోత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. ఈ వివరాలను బహిర్గతం చేయకూడదని సదరు ప్రక్రియలో పాల్గొన్న వారందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

అయితే ఏదో ఒక విధంగా ఈవిషయం బయటపడింది. దీంతో ఒక స్థానిక సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఆ ఐదేళ్ల బాలుడి అసలు తండ్రి ఎవరు  అనేది డీఎన్ఏ టెస్టు చేసి నిర్ధారించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేసింది.  తండ్రి, తాత ఇద్దరి వీర్యాల కలయిక వల్ల పుట్టిన ఆ బాలుడి నిజమైన తండ్రి ఎవరు అవుతారో తేల్చాలని న్యాయస్థానాన్ని కోరింది. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ను తప్పుపట్టింది. ఇలాంటి సమాధానాలను పొందడం ద్వారా పిటిషన్ వేసిన సంస్థకు వచ్చే లాభమేదీ లేదని స్పష్టం చేసింది. సదరు కుటుంబాన్ని బజారుకు ఈడ్చాలనే తాపత్రయం మాత్రమే ఈ పిటిషన్‌లో కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ బాలుడి రియల్ తండ్రిని తేల్చాలా ? వద్దా ? డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలా ? వద్దా ? అనే దానిపై తుది నిర్ణయం ఆ కుటుంబం వారే తీసుకుంటారని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అసలు ఈ ప్రశ్నకు ఇప్పుడు అంతగా ప్రాధాన్యం లేదని కామెంట్ చేసింది. ఆ బాలుడితో తండ్రి, తాతగా చలామణి అవుతున్నవారు అలాగే కొనసాగడం మంచిదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Also Read : India Vs Pakistan : పాక్ డ్రోన్ల కలకలం.. భారత సైన్యం రియాక్షన్ ఇదీ