Site icon HashtagU Telugu

Hands Glued : ఓ మహిళ గొప్ప మనసు.. పెయింటర్ చేతులు తిరిగొచ్చాయి

Hands Glued

Hands Glued

Hands Glued : అతడొక పెయింటర్. వయసు 45 ఏళ్లు.  రెండు చేతులతో అందమైన పెయింటింగ్స్ వేయగా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు.  ఒక ప్రమాదంలో అతడి రెండు చేతులూ తెగిపోయాయి. ఇప్పుడు మళ్లీ అతడు  తన చేతుల్లోకి కుంచెను తీసుకోబోతున్నాడు. అదెలా సాధ్యమైంది ? మళ్లీ చేతులు ఎలా వచ్చాయి ? వివరాలు తెలియాలంటే వార్త మొత్తం చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

అది 2020 సంవత్సరం.. ఆ ఏడాది జరిగిన రైలు ప్రమాదంలో ఆ పెయింటర్ రెండు చేతులను కోల్పోయాడు. నిరుపేద కుటుంబ నేపథ్యం కలిగిన ఆ పెయింటర్ తన పట్ల విధి ఆడిన నాటకంతో చేతులు లేకుండానే కాలం వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలో సౌత్ ఢిల్లీ స్కూల్‌లో ప‌నిచేస్తున్న మీనా మెహ‌తా ఇటీవ‌ల బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో వైద్యులు ఆమె రెండు చేతులను పెయింటర్ కు అతికించారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో ఈ అరుదైన సర్జరీ జరిగింది. దాదాపు 12 గంట‌ల పాటు డాక్ట‌ర్లు ఈ స‌ర్జ‌రీ చేశారు. మీనా మెహతా చేతులను తీసి..  పెయింటర్ చేతులలోని(Hands Glued)  అన్ని న‌రాలు, కండ‌రాలకు కచ్చితత్వంతో జాయింట్  చేశారు.

Also Read :EVs Dangerous : ఈవీలతోనే ఎక్కువ కాలుష్యం.. సంచలన రిపోర్టులో కీలక విషయాలు

ఈ ఆపరేషన్ లో వైద్యులు దాత చేతులు, గ్రహీత చేతుల మధ్య ఉన్న ప్రతి ధమని, కండరం, స్నాయువు, నరాలను ఎంతో శ్రమించి ఒకటిగా కలిపారు. డాక్ట‌ర్లు ప‌డ్డ శ్ర‌మ ఫ‌లించింది. ఓ వ్యక్తికి పోయిన చేతులు తిరిగొచ్చాయి. సర్జరీ త‌ర్వాత డాక్టర్లతో ఫోటో దిగిన స‌మ‌యంలో ఆ పెయింట‌ర్ త‌న చేతుల‌తో థ‌మ్స్ అప్ సంకేతం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి. గురువారం రోజు ఆసుపత్రి నుంచి ఆ పెయింటర్ కొత్త చేతులతో డిశ్చార్జ్ కాబోతున్నాడు. మెడిక‌ల్ హిస్టరీలో ఇండియన్ డాక్టర్లు చేస్తున్న అద్భుతాలను చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  మీనా మెహ‌తా అవయవదానం వల్ల ఈ పెయింటర్‌తో పాటు మొత్తం నలుగురి జీవితాలలో వెలుగులు నిండాయి. మీనా మెహతా చనిపోయిన తర్వాత ఆమె కుటుంబం అనుమతి మేరకు అవయవదానం చేశారు. ఆమె మూత్రపిండాలు, కాలేయం, కార్నియాలను మరో ముగ్గురికి అమర్చారు. ఏదిఏమైనప్పటికీ ఇక్కడ హ్యాట్సాఫ్ చెప్పాల్సింది మీనా మెహతా. అవయవదానం వల్ల ఆమెకు పునర్జన్మ లభించినట్లు అయింది.