Site icon HashtagU Telugu

Turkey Birds Business : ఏడాదికి 10 లక్షల లాభం.. ఈ కోళ్లు గురించి మీరు తెలుసుకోవాల్సిందే..!

Turkey Bird Business Super Profitable

Turkey Bird Business Super Profitable

Turkey Birds Business : కోళ్ల పెంపకం ఒక లాభదాయకమైన వ్యాపారమే. ఏ బిజినెస్ అయినా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తే తప్పకుండా లాభాలు తెచ్చి పెడుతుంది. ఒకవేళ లాభాలు అంత గొప్పగా రాకపోయినా నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉండదు. కోళ్ల పెంపకం ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. పౌల్ట్రీలో కోళ్లు పెంచడం అనేది చాలా వరకు అందరు చేస్తున్న బిజినెస్. అయితే బాయిలర్ కోళ్ల బదులుగా ఎక్కువ లాభాలు ఇచ్చే టర్కీ కోళ్లు (Turkey Birds) అయితే బిజినెస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

టర్కీ కోడి ఒక్కొక్కటి 6, 7 కిలోల బరువు ఉంటుంది. కొన్ని 7 కిలోల కన్నా ఎక్కువ ఉంటాయి. పౌల్ట్రీ లో చికెన్ కన్నా రైతులకు టర్కీ కోళ్లకు (Turkey Birds) ఎక్కువ ధర వచ్చేలా చేస్తుంది. టర్కీ కోడి పెరగడానికి కొంత టైం తీసుకుంటుంది కానీ టర్కీ కోళ్ల బిజినెస్ మాత్రం మంచి లాభదాయమైన వ్యాపారమని రైతులు కూడా చెబుతున్నారు.

టర్కీ కోళ్ల (Turkey Birds) పెంపకం కొద్దిగా ఖర్చుతో కూడిన పనే అయినా లాభాలు కూడా అందుకు తగినట్టుగానే ఉంటుందని చెప్పొచ్చు. టర్కీ కోళ్లు తినడం వల్ల విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. బి3, బి6 విటమిన్స్ తో పాటుగా కొవ్వు శాతం తక్కువగా ఉండటం విశేషం. టర్కీ కోళ్ల పెంపకం తో ఏడాదికి 10 లక్షల అదాయాన్ని పొందొచ్చు. టర్కీ కోడి 7 నెలల్లో మార్కెట్ చేసేందుకు వస్తుంది. ఆల్రెడీ పౌల్ట్రీ బిజినెస్ ఉన్న వారైతే ఈ టర్కీ కోళ్ల బిజినెస్ మంచి బిజినెస్ అంటున్నారు. మామూలుగా పౌల్టీల్లో బాయిలర్ కోళ్లు పెంచే వారు ఈ టర్కీ కోళ్ల (Turkey Bird) బిజినెస్ చేస్తే తప్పకుండా మంచి లాభాలు తెచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

Also Read:  Tata Nexon facelift: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో అదరగొడుతున్న టాటా నెక్సాన్ కార్?