బీహార్ లో విషాదం నెలకొంది. ఛత్ ఉత్సవాల సందర్భంగా నీటిలో మునిగి 53మంది మరణించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన ఛత్ ఉత్సవాల సందర్భంగా…రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని నదుల్లో 53మంది మునిగి మరణించినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ అధికారిక వెల్లడించారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్…. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
బాధిత కుటుంబాలకు తొందరగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లను సీఎం ఆదేశించారు. కాగా పాట్నాలోని ఛత్ పూజ సందర్భంగా సీఎం నితిష్ కుమార్ కూడా గాయపడ్డారు. ఛత్ ఘాట్లను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయన ప్రయాణిస్తున్న స్టీమర్ జేపీ సేతు వంతెనను ఢీ కొట్టింది. నితిష్ కుమార్ స్వల్పంగా గాయాలయ్యయి.