Gold Rate : మహిళలకు బ్యాడ్ న్యూస్…పెరిగిన బంగారం ధరలు, ఎంత పెరిగిందో చెక్ చేసుకోండి..!!

బంగారం అంటే భారతీయులకు చాలా మోజు. బంగారం కొనే వారికే కాదు, ప్రతి ఒక్కరికీ రోజువారి బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది

  • Written By:
  • Publish Date - September 7, 2022 / 10:10 AM IST

బంగారం అంటే భారతీయులకు చాలా మోజు. బంగారం కొనే వారికే కాదు, ప్రతి ఒక్కరికీ రోజువారి బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ రోజు బంగారం ధరను తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. నేడు బుధవారం బంగారం ధరలు మరింత పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధర ఎంత అనేది నగల ప్రియుల కోసం ఇక్కడ పేర్కొన్నాం. ఈరోజు, సెప్టెంబర్ 7, బుధవారం ఉదయం, దేశంలో 10 గ్రాముల (24 క్యారెట్) బంగారం ధర రూ. 51,160గా నమోదైంది. హైదరాబాద్ లో, 10 గ్రాముల (24 క్యారెట్) బంగారం రూ. 51, 200గా నిర్ణయించారు.

రోజువారీ ధర ప్రక్రియలో, ఈ ఉదయం హైదరాబాద్ లో ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల (22 క్యారెట్లు) ధర రూ. 46,950గా నిర్ణయించారు.

ప్రధాన నగరాల్లో నేటి 10 గ్రాముల బంగారం ధర ఇలా ఉంది:
నెల్లూరు: రూ. 47,500 (22 క్యారెట్) – రూ. 51,820 (24 క్యారెట్)
విశాఖపట్నం: రూ. 47,050 (22 క్యారెట్) – రూ. 51,320 (24 క్యారెట్)
ప్రొద్దుటూరు: రూ. 46,900 (22 క్యారెట్) – రూ. 51,160 (24 క్యారెట్)
వైజాగ్: రూ. 46,900 (22 క్యారెట్) – రూ. 51,000 (24 క్యారెట్)
విజయవాడ: రూ. 46,950 (22 క్యారెట్) – రూ. 51,200 (24 క్యారెట్)
ముంబై: రూ. 46,900 (22 క్యారెట్) – రూ. 51,160 (24 క్యారెట్)

వెండి రేటు
దేశంలో కిలో వెండి ధర రూ. 53,900కి పెరిగింది. ఒక కిలో వెండి ధర రూ. 59,000 మరియు పెరిగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల వెండి ధరలు పెరగగా, కొన్ని చోట్ల తగ్గాయి. ఓవరాల్ గా ఈ ఉదయం వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధర పెరిగితే.. వెండి ధర కూడా పెరిగింది. ఎప్పటిలాగే ఉదయం పదకొండు గంటల వరకు మళ్లీ ధర పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ ట్రెండ్, బంగారంపై దిగుమతి సుంకం, డాలర్‌తో రూపాయి విలువ ఆధారంగా రోజువారీ బంగారం, వెండి ధరలు నిర్ణయిస్తారు. మీరు ప్రతిరోజూ మీ నగరాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలను తెలుసుకోవచ్చు.