Site icon HashtagU Telugu

Gold : మహిళలకు గుడ్ న్యూస్, భారీగా పడిపోయిన బంగారం ధర, ఎంత పడిందంటే..?

Gold- Silver Prices

Gold- Silver Prices

బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి ఓ శుభవార్త. వరుసగా అనేక రోజుల పాటు పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.225 తగ్గి రూ.50,761కి చేరుకుంది. నిన్నటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.50,986 గా పలికింది.

వెండి కూడా గత ట్రేడింగ్‌లో కిలోకు రూ.54,324 నుంచి రూ.315 తగ్గి రూ.54,009కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,702 డాలర్లు ఉండగా, వెండి ఔన్స్ ధర 18.18 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. డాలర్ బలపడటంతో ఔన్సు బంగారం ధర 1,700 డాలర్లకు చేరువలో ఉంది.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ ఉదయం ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల (22 క్యారెట్లు) రూ. 46,450గా పలుకుతోంది. అదే సమయంలో 10 గ్రాముల అపరంజి బంగారం (24 క్యారెట్లు) ధర రూ.50,670గా నమోదైంది.

ప్రధాన నగరాల్లో నేటి 10 గ్రాముల బంగారం ధర ఈ విధంగా ఉంది:
హైదరాబాద్: రూ. 46,400 (22 క్యారెట్) – రూ. 50,620 (24 క్యారెట్)
విజయవాడ: రూ.46,400 (22 క్యారెట్) – రూ.50,620 (24 క్యారెట్)
ప్రొద్దుటూరు: రూ.46,450 (22 క్యారెట్) – రూ.50,670 (24 క్యారెట్)
నెల్లూరు: రూ.46,400 (22 క్యారెట్) – రూ.50,620 (24 క్యారెట్)
విశాఖపట్నం: రూ.46,450 (22 క్యారెట్) – రూ.50,670 (24 క్యారెట్)
చెన్నై: రూ. 47,500 (22 క్యారెట్) – రూ. 51,820 (24 క్యారెట్)
ఢిల్లీ: రూ. 47,050 (22 క్యారెట్) – రూ. 51,320 (24 క్యారెట్)

మొత్తమ్మీద, ఈ ఉదయం నాటికి, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది, వెండి ధర తగ్గింది. ఉదయం పదకొండు గంటల వరకు మళ్లీ ధర మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ ట్రెండ్, బంగారంపై దిగుమతి సుంకం, డాలర్‌తో రూపాయి విలువ ఆధారంగా రోజువారీ బంగారం, వెండి ధరలు నిర్ణయించబడతాయి. ఇక్కడ మీరు ప్రతిరోజూ మీ నగరాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలను తెలుసుకోవచ్చు.

Exit mobile version