దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధియోజన ద్వారా చాలా మంది రైతులు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇప్పటివరకు 11విడత డబ్బులు పడ్డాయి. త్వరలోనే 12వ విడత డబ్బులు కూడా పడనున్నాయి. అయితే ఈ స్కీం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకువచ్చారు. ప్రతిఏటా ప్రభుత్వం రైతులకు 6వేల రూపాయాలను ఈ స్కీం కింద అందిస్తోంది.
మొత్తం 6వేల రూపాయాలను రెండు వేల చొప్పున మూడు విడతలుగా జమ చేస్తుంది ప్రభుత్వం. కాగా విడత డబ్బులు రాని రైతులు చాలా మంది ఉన్నారు. వారు 11 వ విడత డబ్బులు అకౌంట్లో పడకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ డబ్బులను పొందని రైతులు 12 విడతతోపాటు 11 వ విడత డబ్బులను కూడా పొందవచ్చు. అదేలాగంటే..
11వ విడత డబ్బులు పొందని రైతులు ఇప్పుడు రెండు వేలకు బదులుగా నాలుగువేల రూపాయలను పొందవచ్చు. ఈ స్కీం కింద రైతులు అకౌంట్లో డబ్బు జమ కాలేదంటే పీఎం కిసాన్ యోజనలో రిజిస్టర్ చేసేటప్పుడు ఏదైనా సమాచారాన్ని నింపకపోయినట్లయితే లేదా చిరునామా లేదా బ్యాంక్ అకౌంట్ సమాచారం సరిగ్గా లేకపోవడం జమ కాకపోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరెక్షన్ పెండింగ్ లో ఉన్నా కూడా డబ్బులు అకౌంట్లో జమ కావు. బెనిఫిషియరీ స్టేటస్ చూడాలంటే pmkisan.gov.in అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి. కుడి వైపున ఉన్న పూర్వమూలలోకి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.