Breath Underwater : ఊపిరి బిగబట్టుకొని నీళ్లలో 5 నిమిషాలు ఈత కొట్టగలరు.. ‘సమా బజౌ’ తెగ విశేషాలు

Breath Underwater : నీళ్లలో మునిగి మీరు ఎంతసేపు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలరు ? మా అంటే 1 నిమిషం లేదా ఒకటిన్నర నిమిషం..!!

  • Written By:
  • Updated On - December 30, 2023 / 02:17 PM IST

Breath Underwater : నీళ్లలో మునిగి మీరు ఎంతసేపు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలరు ? మా అంటే 1 నిమిషం లేదా ఒకటిన్నర నిమిషం..!! కానీ సమా-బజౌ తెగ ప్రజలు నీళ్లలో మునిగిపోయి దాదాపు 5 నిమిషాల పాటు కంటిన్యూగా మొస మరల్చుకోకుండా ఈత కొట్టగలరు. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో వారికి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కూడా ఎదురుకాదు. ఇంతకీ ఎక్కడిదీ తెగ ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

సమా-బజౌ.. ఇదొక వెరైటీ సంచార జాతి. ఆగ్నేయాసియా ప్రాంతంలోని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై దేశాల్లోని కొన్ని దీవుల్లో ఈ ప్రాచీన తెగ ప్రజలు నివసిస్తుంటారు. సముద్ర తీరంలో పడవలపై లేదా సముుద్ర తీరంలో నిర్మించుకున్న గుడిసెల్లో జీవించడం ఈ తెగ ప్రత్యేకత. ఈ తెగ ప్రజల జీవితంలో సముద్రం ఒక భాగం. వీరి జీవితమంతా సముద్ర తీర వాతావరణంలోనే గడుస్తుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఈ తెగ ప్రజలు ఒక్కో సీజన్‌లో ఒక్కో సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి జీవిస్తుంటారు.

Also Read: Airplane Under Bridge : బ్రిడ్జి కింద విమానం జామ్.. ఎలా ?

సముద్రం వద్దే జీవిస్తుండటంతో సమా-బజౌ తెగ ప్రజలకు సహజంగానే ఈతపై మిగతా వారి కంటే ఎక్కువ పట్టు(Breath Underwater) ఉంటుంది. వీరు సముద్రంలోని చేపలను, ఇతర జలచరాలను వేటాడి పట్టుకొని తింటుంటారు. ఈక్రమలో కనీసం ఐదు నిమిషాల పాటు సముద్ర జలాల్లో ఈత కొట్టి చేపలను పట్టుకొని తీసుకొస్తుంటారు. మనలాంటి వాళ్లు ఈ ఫీట్ సాధించడం చాలా కష్టం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఈతగాళ్లు కూడా గరిష్టంగా 3 నుంచి 4 నిమిషాల వరకే నీళ్లలోపల ఉండి ఈత కొట్టగలరు. కానీ సమా-బజౌ తెగ ప్రజలు రోజూ చేపలు పట్టేందుకు దాదాపు 5 నిమిషాలు సముద్రంలోపలే ఈతకొట్టి వస్తుంటారు. దీనివల్ల వారి ఊపిరితిత్తుల సామర్థ్యం మిగతా వారి కంటే చాలా ఇంప్రూవ్ అయింది.