Site icon HashtagU Telugu

Designer Bacteria: శరీరంలోని బ్యాక్టీరియాతో ఆభరణాల డిజైనింగ్ చేస్తోంది!!

Chloe Fitzpatrick

Chloe Fitzpatrick

“బ్యాక్టీరియా”.. ఈ పదాన్ని చదివినప్పుడల్లా లేదా విన్నప్పుడల్లా చాలామంది అసౌకర్యానికి గురవుతారు.ఒక బయో డిజైనర్ మాత్రం ఈ విరక్తిని అధిగమించి.. “బ్యాక్టీరియా”లను వినియోగించి వాటితో ఆభరణాలను తయారు చేస్తోంది. అందుకే క్లో ఫిట్జ్‌పాట్రిక్ ను అందరూ “బయో డిజైనర్” అని పిలుస్తున్నారు.

బ్యాక్టీరియాలతో ఆభరణాల డిజైనింగ్ అంటే ఆషామాషీ విషయం కాదు. చిన్నపిల్లల ఆట కానే కాదు. అందుకే క్లో ఫిట్జ్‌పాట్రిక్ ఈవిషయంలో బ్రిటన్ లోని Dundee University, the James Hutton Instituteలతో కలిసి పనిచేసింది. మొక్కల్లో ఉండే బ్యాక్టీరియాలతో పాటు తన శరీరం పై ఉండే బ్యాక్టీరియాలతో ఆకట్టుకునే వర్ణ ద్రవ్యాలను ఏ విధంగా తయారు చేయొచ్చనే దానిపై స్టడీ చేశారు. ఆ తర్వాతే బ్యాక్టీరియాలతో ఆభరణాల డిజైనింగ్ వర్క్ కు క్లో ఫిట్జ్‌పాట్రిక్ శ్రీకారం చుట్టారు.బ్యాక్టీరియాల ద్వారా అభివృద్ధి చేసిన వర్ణ ద్రవ్యాలను తొలుత UV రెసిన్‌లో భద్రపరిచారు. వీటితో ఆభరణాల వర్క్ లో, అద్దకానికి వాడే దారాలను తయారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. క్లో ఫిట్జ్‌పాట్రిక్ స్వయంగా తన శరీరంలోని వివిధ భాగాల నుంచి బ్యాక్టీరియాల ను సేకరించి భద్రపరిచారు. నిర్దిష్ట పరిమితిలో, నిర్దిష్ట సంఖ్యలో పెంచాక.. వాటి నుంచి భిన్న విభిన్న రకాల వర్ణ ద్రవ్యాలను తయారు చేశారు. వీటినే ఆభరణాలకు కొంగొత్త రంగుల అందం అద్దేటందుకు వాడారు. సాధారణంగా కొన్ని రసాయన పదార్థాలతో ఆభరణాలకు డైయింగ్ చేస్తారు. కానీ బ్యాక్టీరియాలతో ఆభరణాలకు డైయింగ్ చేయడం వెరీ నేచురల్.

మనిషి నుంచి సేకరించే బ్యాక్టీరియా.. మొక్కల నుంచి సేకరించే బ్యాక్టీరియాకు ఉన్న తేడాను గుర్తించేందుకు కూడా బయో డిజైనర్ క్లో ఫిట్జ్‌పాట్రిక్ ప్రయత్నించారు. ఇందులో భాగంగా
Z brush అనే 3డీ ప్రింటింగ్ ప్రోగ్రాం ద్వారా మనిషి ముఖం, మొక్క ఆకు వంటి విభిన్న ఆకారాలను గీసి చూశారు. ఈ వివరాలను ఆమె తన వెబ్ సైట్ లో ప్రస్తావించారు.