Site icon HashtagU Telugu

Delhi Polution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకరంగా కాలుష్యం..స్కూల్స్, కాలేజీలకు సెలవు.?

Noida 2

Noida 2

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం గ్రేటర్ నోయిడా లో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా రెడ్ జోన్లో 402గా నమోదు అయ్యింది. అదేవిధంగా AQI 398 కి చేరుకుంది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల సంఖ్యలో గ్రేటర్ నోయిడా మూడవ స్థానంలో ఉంది. నోయిడా ఐదో స్థానంలో ఉంది. అయితే కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా మారడంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించనున్నారు. గ్రేప్ నాలుగో దశలో కఠినమైన నియమాలను తీసుకోనుంది ప్రభుత్వం. బుధవారం జరగనున్న ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు కాలుష్యం కారణంగా ఓపీడీ, ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్పత్రుల్లోని ఓపీడీల్లో 10 నుంచి 15 శాతం రోగులు పెరిగారు. ఈ రోగులలో, అత్యధిక సంఖ్యలో ఆస్తమా దాడులు, శ్వాసకోశ రోగులు. జలుబు, దగ్గు, గొంతు బిగుతు, కళ్ల మంటలతో బాధపడే వారి సంఖ్య రోగుల్లో పెరిగింది.