Moon Formation : చంద్రుడు ఊడిపడింది భూమి నుంచే.. కొన్ని గంటల్లోనే ఆవిర్భావం!!

చంద్రుడు, భూమి నుంచి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.చందమామ మనిషిని అందుకునేంత టెక్నాలజీ వచ్చేసినా.. చందమామ పుట్టుక మిస్టరీ నేటికీ వీడలేదు. ఆ దిశగా ఆశించిన పురోగతి జరగలేదు.

  • Written By:
  • Publish Date - October 11, 2022 / 10:40 AM IST

చంద్రుడు, భూమి నుంచి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.చందమామ మనిషిని అందుకునేంత టెక్నాలజీ వచ్చేసినా.. చందమామ పుట్టుక మిస్టరీ నేటికీ వీడలేదు. ఆ దిశగా ఆశించిన పురోగతి జరగలేదు.

ఇంతకీ చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు ?

చంద్రుడి పుట్టుకలో భూమి పాత్ర కూడా ఉందా? అంటే.. బ్రిటల్న్ లోని డార్హం యూనివర్సిటీకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఫర్ కంప్యూటేషనల్ కాస్మాలజీ శాస్త్రవేత్తలు ” ఔను ” అని బదులిస్తున్నారు. ఈ పరిశోధకులు ఇప్పుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. సూపర్ కంప్యూటర్ తో ఒక సిమ్యులేషన్ ను అభివృద్ధి చేసి పరీక్షించారు.దీని ప్రకారం.. 450 కోట్ల ఏళ్ల క్రితం భూమి మరియు థియా అని పిలువబడే మార్స్ గ్రహము పరిమాణం కలిగిన శరీరం రెండూ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో మార్స్ గ్రహము పరిమాణం కలిగిన శరీరం బద్దలైంది. దానిలో దాదాపు 80 శాతం భూమిలో కలిసిపోయింది. మిగిలిన 20 శాతం భాగం భూమికి దూరంగా ఉండిపోయి స్వతంత్రముగా కదలాడింది. ఆ రెండో భాగమే చంద్రుడు అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కారణం వల్లే భూమి, చంద్రుడి ఉపరితలంలోని భౌగోళిక స్వభావం ఒకే రీతిలో ఉందన్నారు. ఈక్రమంలో చంద్రుడు ఏర్పడటానికి శతాబ్దాలు కాదు కేవలం కొన్ని గంటల సమయమే పట్టిందని చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలు ” ది ఆస్ట్రోఫిజికల్” జర్నల్ లెటర్స్‌లో ప్రచురించబడ్డాయి.

కామో ఓవాలెవా అనే గ్రహశకలం..

2016లో శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉన్న ఒక గ్రహశకలాన్ని కనిపెట్టారు. కామో’ ఓవాలెవా అనే ఈ గ్రహశకలం పుట్టుక రహస్యం ఛేదించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.ఇది భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉందన్న విషయం తప్ప ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇతర వివరాలేమీ తెలియవు.అయితే, ఇటీవల జరిగిన ఒక పరిశోధన దీని పుట్టుక గురించి కొన్ని ఆధారాలను తెలియజేస్తోంది. ఇది చంద్రుని నుంచి ఊడిపడిన భాగం కావచ్చని అంటున్నారు.