Site icon HashtagU Telugu

VVIP Jackets : పొలిటీషియన్స్, వీవీఐపీల రక్షణ కోసం నెహ్రూ జాకెట్.. విశేషాలివి

Bullet Proof Jackets

Bullet Proof Jackets

రాజకీయ నాయకులు, వీవీఐపీలు ఆత్మ రక్షణ కోసం తుపాకులు దగ్గర ఉంచుకోవడాన్ని ఇప్పటిదాకా చూశాము.. ఇకపై ఈ తరహా సెల్ఫ్ సెక్యూరిటీ మరో అడుగు ముందుకు పడనుంది. పొలిటీషియన్స్, వీవీఐపీల రక్షణ కోసం అందుబాటులోకి రానున్న మరో అస్త్రం “నెహ్రూ జాకెట్”. దీని ధర కేవలం రూ.35వేలే. భారత రక్షణ శాఖ పరిధిలోని “ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్” దీన్ని అభివృద్ధి చేసింది. జులై 6, 7 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరుగుతున్న “అంతర్జాతీయ పోలీస్ ఎక్స్ పో -2022″లో “నెహ్రూ జాకెట్”ను “ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్” ప్రదర్శించింది. దాదాపు 18 దేశాలకు చెందిన 3050కిపైగా కంపెనీలు సైనిక రక్షణ ఉత్పతులను ఈ ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నాయి.

“నెహ్రూ జాకెట్” ప్రత్యేకత..

దీని బరువు రెండున్నర కిలోలు. సమీపం నుంచి.. చిన్న తుపాకులతో జరిపే కాల్పుల నుంచి రక్షణ కల్పించగలదు. కత్తి దాడి నుంచి కాపాడలేదు. కత్తి దాడి నుంచి కూడా రక్షించేలా.. దీన్ని అభివృద్ధి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. “నెహ్రూ జాకెట్” చూడటానికి సాధారణ వస్త్రం లాగే కనిపిస్తుంది. దీన్ని పదే పదే ఉతికి ధరించవచ్చు. పంజాబ్ లోని చండీగఢ్ లో ఉన్న టర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లేబొరేటరీ లో ఈ జాకెట్ ను పరీక్షించారు.

Exit mobile version