Site icon HashtagU Telugu

Canada: దేవాలయం పై భారత్ వ్యతిరేక నినాదాలు..ఎక్కడో తెలిస్తే షాక్..!!

Canada

Canada

కెనడాలో నారాయణస్వామి ఆలయా గోడలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనను కెనడాలోని భారత హైకమిషన్ ఖండించింది. అధికారులతో చర్చించి నేరస్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. కెనడాలోని భారత హైకమిషన్ ట్వీట్ చేస్తూ, ‘భారత వ్యతిరేక గ్రాఫిటీతో BAPS స్వామినారాయణ్ మందిర్ ను అపవిత్రం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ట్వీట్ చేసింది.

అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామంటూ ట్వీట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయం అక్కడ ఆలయ గోడలపై ఖలిస్తానీ నినాదాలు రాశారు. కాగా ఈ ఘటనపై బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రకమైన ద్వేషాలకు కెనడాలో స్థానం లేదన్నారు. బాధ్యులను త్వరగా శిక్షిస్తామని తెలిపారు. తరచుగా ఇలాంటి ఘటనలు జరగుతుండటంతో అక్కడున్న హిందువులు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version