Site icon HashtagU Telugu

Sudhamurthy: బాలీవుడ్ పాటకు స్టెప్పులు వేసిన సుధామూర్తి.. నెటిజన్స్ ఫిదా!

Sudha Murthy dance

Sudha Murthy

ఇన్ఫోసిస్ సంస్థ ఛైర్ పర్సన్ సుధామూర్తి (Sudhamurthy) గ్రేట్ పర్సన్.. పేరున్న సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా కామ్ గా, క్యాజువల్ గా కనిపిస్తారు. అదే ఆమె ప్రత్యేకత. ట్రైన్, ఫ్లైట్ జర్నీలో కూడా సాధారణ చార్జీలకే ప్రయాణిస్తుంటారు. మహిళలను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. తాజాగా ఈ గ్రేట్ పర్సనాలిటీ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ (Dance video) చేసి ఆశ్చర్యపర్చింది.

బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్ హిందీ పాట పాడుతుంటే  డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట (Social media) వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. శ్రేయా, సుధామూర్తి కోసం డైరక్టర్ మణిరత్నం తెరకెక్కించిన గురు సినిమాలోని ‘బర్సో రే మేఘా మేఘా’ పాట పాడింది. ఈ పాట సుధాకు ఫేవరేట్ కావడంతో డ్యాన్స్ చేస్తుంటే.. పక్కన వున్నవాళ్లు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య అయిన సుధామూర్తి (Sudhamurthy) రచయితగా, సామాజిక స్పృహ వున్న వ్యక్తి చాలా పాపులర్. ఈమె వైజ్ అండ్ అదర్ వైజ్ వంటి పుస్తకాలు రాశారు. ఇంకా అనాధ ఆశ్రమాలను కూడా నెలకొల్పారు.

Also Read: Pooja Hegde Pics: శారీలోనూ సెక్సీ లుక్స్.. పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ వైరల్!