Free Laptop Scheme: ఈ ఉచిత ల్యాప్ టాప్ స్కీమ్ తో విద్యార్థులు తస్మాత్ జాగ్రత్త..!!

ప్రధానమంత్రి నేషనల్ ల్యాప్ టాప్ స్కీం అనేది సామాజిక మీడియాలో వైరల్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - October 12, 2022 / 06:12 AM IST

ప్రధానమంత్రి నేషనల్ ల్యాప్ టాప్ స్కీం అనేది సామాజిక మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పథకం కింద విద్యార్థులకు కేంద్రప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ అందిస్తోందన్న మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ స్కీం విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు ఇలాంటి పథకాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి లేదంటో మొదటికే మోసం వస్తుంది.

ముఖ్యవిషయం ఏంటంటే…కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫ్రీ ల్యాప్ టాప్ స్కీంను తీసుకురాలేదు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఫ్రీ ల్యాప్ టాప్ స్కీం లేదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. సామాజిక మీడియాలో వస్తున్న ఈ పథకాలను నమ్మకూడదు. ఎవరికైనా ఫ్రీ ల్యాప్ టాప్స్ అంటూ మెసేజ్ లు వస్తే దాన్ని అస్సలు నమ్మకూడదు. వెంటనే ఆ మెసేజ్ డిలీట్ చేయండి.

ప్రధానమంత్రి మోదీ ఫొటోతో ఉచిత ల్యాప్ టాప్ స్కీం అంటూ ఒక పోస్టు వైరల్ అవుతోంది. 11వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ పొందవచ్చని ఇందులో ఉంది. ఈ అంశంపై PIBఫ్యాక్ట్ చెక్ టీం దర్యాప్తు చేసింది. ఇందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. ప్రధాన్ మంత్రి నేషనల్ ల్యాప్ టాప్ స్కీం 2022 అనేది లేదు. వైరల్ అవుతోన్న మెసేజ్ లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించింది. ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరింది.