Bhopal : ‘భారత్ మాతా కీ జై’ నినాదం చేసినందుకు విద్యార్థిపై టీచర్ల దాడి.!! టీచర్లపై FIR నమోదు..!!

  • Written By:
  • Publish Date - November 4, 2022 / 04:27 AM IST

మధ్యప్రదేశ్‌లో భోపాల్ నోని ఓ పాఠశాల మీటింగ్‌లో ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేసినందుకు విద్యార్థిని దారుణంగా కొట్టారు ఉపాధ్యాయులు. ఈ సంఘటన బుధవారం గుణలోని క్రైస్ట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో జరిగింది. ఈ ఘటనపై ఆగ్రహంవ్యక్తం చేస్తూ విద్యార్థి కుటుంబ సభ్యులు, కొన్ని సామాజిక సంస్థలు స్కూల్ ముందు ఆందోళన చేపట్టాయి. రైట్‌వింగ్ సభ్యుల బృందం కూడా నిరసనలో చేరి పాఠశాల ఆవరణలో ‘హనుమాన్ చాలీసా పథం’ పఠించారు.

ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా…విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గుణ జిల్లా పోలీసులను ఆదేశించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడినట్లు మిశ్రా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టీచర్లు- జస్టిన్, జాస్మినా ఖాటూన్‌లపై ఐపిసి సెక్షన్లు 323, 506 , 34, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టంలోని సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జాతీయ గీతాలాపన అనంతరం ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేసినందుకు తనను తీవ్రంగా కొట్టారంటూ శివాన్ష్ జైన్ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థి తన ఫిర్యాదులో ఇలా పేర్కొన్నాడు. అసెంబ్లీ మీటింగ్ అనంతరం నేను క్లాస్ రూమ్ కు వెళ్లాను . అక్కడ మా క్లాస్ టీచర్…నేను తరగతి పేరును పాడుచేస్తున్నానంటూ కొట్టారు. ఆ తర్వాత నాలుగు పీరియడ్ లు నన్ను నేలపై కూర్చోబెట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ స్పందిస్తూ.. పాఠశాల రాజకీయాలకు అడ్డా కాకూడదని అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సరికాదన్నారు. దేశానికి మద్దతివ్వాలని నినాదాలు చేస్తున్నారు, దానిని ఆపకూడదు. ప్రతి పాఠశాలకు దాని స్వంత నియమాలు ఉన్నాయి. కొన్ని నినాదాలు సరైనవి కొన్ని తప్పంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.