UP : వింత దొంగతనం…20లక్షల విలువైన నగలు దోచుకుని…అందులో సగం నగలు కొరియర్ చేసిన దుండగులు..!!

  • Written By:
  • Updated On - November 1, 2022 / 10:38 PM IST

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వింత దొంగతనం వెలుగుచూసింది. దీపావళి సందర్భంగా ఓ ఇంట్లో చొరబడిన దొంగలు సుమారు 20లక్షల విలువచేసే నగలు అపహరించారు. అయితే అందులో నాలుగు లక్షల విలువ చేసే ఆభరణాలు తిరిగి కొరియర్ ద్వారా ఆ కుటుంబానికి పంపించారు. అయితే ఈ కొరియర్ ఎవరు చేశారు..ఎక్కడి నుంచి చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఫార్చూన్ సొసైటీ ఆఫ్ రాజ్ గనర్ ఎక్స్ టెన్షన్ లోని ప్రీతి సిరోహిటి ఫ్లాట్ లో 20లక్షల విలువైన ఆభరణాలను దొంగలించారు. తమ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ బాధితులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నాలుగు లక్షల విలువైన నగలను కొరియర్ ద్వారా పంపించారు దుండగులు. కొరియర్ తెరిచి చూసిన బాధితులు…అందులో నగలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే కొరియర్ కు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.

ఆ కొరియర్ పై ఉన్న కంపెనీకి సంబంధించిన రికార్డులు, ఫుటేజీలను పరిశీలించగా.. కొరియర్ కంపెనీ కార్యాలయానికి కొరియర్ చేసేందుకు ఇద్దరు యువకులు వచ్చినట్లు గుర్తించారు. రాజ్‌దీప్ జ్యువెలర్స్, సరాఫా బజార్, హాపూర్ పేరు చిరునామాతో కొరియర్ పంపించారు. పోలీసులు ఇచ్చిన చిరునామాకు చేరుకోగా, ఈ పేరుతో దుకాణాలేవని…దానిపై ఉన్న మొబైల్ నెంబర్ కూడా ఫేక్ అని తేలింది. అయితే కొరియర్ తీసుకువచ్చని యువకుల ఫొటోలను పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఆ యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.