Site icon HashtagU Telugu

Viral Video : విమానంలో నుంచి జారిపడ్డ సైనికుడు, చూస్తే అంతే సంగతులు.. వీడియో వైరల్..!!

Indonesia

Indonesia

ఇండోనేషియాలో భయానకర సన్నివేశం చోటుచేసుకుంది. శిక్షణ సమయంలో…ఓ సైనికుడు విమానం నుంచి నేలపై పడిపోయాడు. విమానంలో కిందికి పడుతున్న సమయంలో ఆ సైనికుడి పారాచూట్ తెరవలేదు. దీంతో 1600 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. కానీ అద్రుష్టవశాత్తు ఆ సైనికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డైలీ మెయిన్ నివేదిక ప్రకారం..సైనికుడు సల్మాన్ క్రిస్నెస్ ఇండోనేషియాకు చెందిన ఆరెంజ్ బెరెట్స్ సభ్యుడు. నవంబర్ 8న సల్మాన్ ఇండోనేషియా రాజధాని జకార్తాకు తూర్పున ఉన్నసులైమాన్ ఎయిర్ బేస్ లో శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది. తక్కువ ఎత్తులో ఎగురుతున్న హెర్క్యూలస్ సి 130 విమానం నుంచి కిందకు సల్మాన్దూకినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలోనే ఇతర సైనికులు కూడా కిందకుదూకారు. కానీ సల్మాన్ పారాచూట్ తెరుచుకోలేదు. భారీ శబ్దంతోకింద పడికపోయాడు. సల్మాన్ కు శరీరం వెనక భాగంలో గాయంకావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.