Solar storm warning : జులై 19న భూమిని తాకనున్న సౌర తుఫాను ? 22 ఏళ్ల తర్వాత మళ్ళీ..!!

అంటే.. ప్రముఖ అంతరిక్ష వాతావరణ శాస్త్రవేత్త తమిత స్కోవ్ ఔను అని బదులిస్తున్నారు. సూర్యుడిపై దక్షిణ ప్రాంతంలో పేలుడు సంభవించి ఒక ఫిలమెంట్ (సన్నటి చీలిక) ఏర్పడిందని .. దానివల్ల ఒక సౌర తుఫాను మొదలైందని ఆమె తెలిపారు.

  • Written By:
  • Publish Date - July 19, 2022 / 12:28 PM IST

సౌర తుఫాను దూసుకొస్తుందా ?

జులై 19న అది భూమిని తాకనుందా ?

అంటే.. ప్రముఖ అంతరిక్ష వాతావరణ శాస్త్రవేత్త తమిత స్కోవ్ ఔను అని బదులిస్తున్నారు. సూర్యుడిపై దక్షిణ ప్రాంతంలో పేలుడు సంభవించి ఒక ఫిలమెంట్ (సన్నటి చీలిక) ఏర్పడిందని .. దానివల్ల ఒక సౌర తుఫాను మొదలైందని ఆమె తెలిపారు. ఇంకొన్ని గంటల్లో అది భూమి ఎగువ వాతావరణ పొరల్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రం దెబ్బతిని టెలి కమ్యూనికేషన్ సేవలు, టీవీలు, జీపీఎస్ సేవలు స్తంభించే ముప్పు ఉంటుందని అంచనా వేశారు. ఈ సౌర తుఫానుకు సంకేతంగా.. ధృవ ప్రాంత దేశాల్లోని పర్వత ప్రాంతాల్లో అరోరా బొరియాలిస్ సంభవిస్తుందని వివరించారు. ఈమేరకు వివరాలతో తమిత స్కోవ్ చేసిన ట్వీట్స్ పై వాడివేడి చర్చ జరుగుతోంది.భూమిపై వెలుగులు నింపే సూర్యుడిలో ఏది జరిగినా .. అది చాలా సెన్సేషనల్!! మునుపెన్నడూ లేని విధంగా సూర్యుడిలో ఈ ఏడాది ఎంతో యాక్టివిటీ జరిగింది. త్వరలో ఇంకొంత కీలకమైన యాక్టివిటీ జరగబోతోంది. ఇప్పుడు దీనిపైనే యావత్ శాస్త్ర ప్రపంచం దృష్టి ఉంది.

సౌర తుఫాన్‌ భూమిని తాకితే ఏమవుతుంది ?

* రేడియో కమ్యూనికేషన్‌లు బాగా ప్రభావితమవుతాయి.

* జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థలు కుప్పకూలిపోతాయి.

* ఇంటర్నెట్‌కు విఘాతం కల్గవచ్చును.

* ఆర్కిటిక్‌ దృవాల వద్ద ఏర్పడే అరోరా బొరియాలిస్‌ ఇతర ప్రాంతాల్లో కూడా కన్పిస్తాయి.

* ప్రపంచవ్యాప్తంగా పవర్‌గ్రిడ్లలో విద్యుత్‌ హెచ్చుతగ్గులు సంభవిస్తాయి.

సరిగ్గా 22 ఏళ్ల క్రితం .. పెద్ద సౌర తుఫాను విశేషాలు

ఒక బిలియన్ అంటే 100 కోట్లు..
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వినియోగించిన అణు బాంబుల కంటే 1000 బిలియన్లు ఎక్కువ అణు బాంబులు ప్రయోగిస్తే వెలువడేంత మ్యాగ్నిటిక్ ఎనర్జీ 2000 సంవత్సరం జులై 14న సూర్యుడి నుంచి భూమి వైపు దూసుకొచ్చింది. అప్పట్లో సూర్యుడిపై చోటుచేసుకున్న సౌర తుఫాను వల్ల ఈ పరిణామం చోటుచేసుకుంది. సూర్యుడిపై ఉండే నల్లటి మచ్చలను సన్ స్పాట్స్ అంటారు. వీటిలోని అయస్కాంత క్షేత్రం లో కదలికల వల్ల తరుచూ విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. ఒక్కోసారి ఇవి తీవ్రమై.. సూర్యుడి ఉపరితలంపై యాక్టివిటీని ప్రభావితం చేసి సౌర తుఫాను గా కూడా మారుతాయి.
సూర్యుడిపై ఇలాంటి తుఫానులు సంభవించినప్పుడు అంతరిక్షంలోకి క్షణాల్లో సౌర గాలులు దూసుకెళ్తాయి. ఈ చర్యనే కరొనల్ మాస్ ఇజెక్షన్ (coronal mass ejection) అంటారు. ఈవిధంగానే 2000 సంవత్సరం జులై 14న సౌర తుఫాను చోటుచేసుకుంది. దానివల్ల సూర్యుడి నుంచి భారీగా కాంతి, ఉష్ణం, ధూళికణాలు భూమి వైపు వెదజల్లబడ్డాయి. భూ అయస్కాంత క్షేత్రాన్ని అవి తాకినప్పుడు.. జియోమాగ్నెటిక్ తుఫానుగా దాని రూపము మారుతుంది. ఫలితంగా ఆ రోజు శాటిలైట్, రేడియో కమ్యూనికేషన్,
జీపీఎస్‌ నేవిగేషన్‌ వ్యవస్థలు సంభవించాయి. టీవీలు, ఫోన్లు మూగపోయాయి. సరిగ్గా 22 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ తరహా పరిణామం మరోసారి పునరావృతం అవుతుందా ? అయితే తీవ్రత ఎలా ఉంటుంది? అనే దానికి శాస్త్ర ప్రపంచమే సమాధానం చెప్పాలి.