ఆ ఊరిలో భయంకరమైన నాగుపాములు స్వేచ్ఛగా తిరుగుతాయి.. అయినా గ్రామస్తులు (snake village shetpal) కొంచెం కూడా భయపడరు. పెద్దల సంగతి అలా ఉంచితే ఊరిలోని పిల్లలు కూడా పాములను చూసి జడవరు.. వణకరు !! మీరు చదువుతున్న సినిమా స్క్రిప్ట్ కాదు !! రియల్ స్టోరీ !! ఇవన్నీ కళ్లారా చూడాలంటే మీరు మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా షెట్‌పాల్ గ్రామానికి వెళ్లాలి. పూణే సిటీకి దాదాపు 200 మైళ్ల దూరంలో ఈ విచిత్రమైన ఊరు ఉంది. ఇక్కడ దాదాపు 2600 జనాభా ఉంది. లోకల్ గా ఉండే పాముల జనాభా ఇంతకంటే ఎక్కువే ఉంటుందని అంటారు.
ఈ ఊరి(snake village shetpal)లోని ప్రతి ఇంట్లో పాములు ఉండటానికి పాముల పుట్ట లాంటి నిర్మాణం ఉంటుంది. ప్రజలు కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు.. పాము పుట్ట కోసం ఒక స్థలాన్ని తప్పకుండా కేటాయిస్తారు. కొన్నిసార్లు పాములు సమీపంలోని పాఠశాలలోకి వెళ్తుంటాయి. అయినా ఉపాధ్యాయులు, విద్యార్థులు వాటిని చూసి కలవరపడరు. క్లాస్ జరుగుతున్నప్పుడు విషసర్పాలు కనిపించినా ఇబ్బంది పడకుండా విద్యార్థులు సబ్జెక్టుపైనే దృష్టి పెడతారు. ఇక్కడి పేరెంట్స్ కూడా పిల్లలను చిన్నతనం నుంచి పాములకు భయపడకుండా పెంచుతారు. ప్రతి ఇంటిలో పాములు తిరుగుతున్నప్పటికీ.. ఊరిలో ఏ ఒక్కరినీ పాము కరిచినట్లు దాఖలాలు లేవు.
మీరు కూడా పాములతో స్నేహం చేయాలనుకుంటే.. వాటికి కొన్ని పాలు, గుడ్లు పెడితే చాలు. మీరు షెట్‌పాల్ గ్రామానికి వెళ్లాలని అనుకుంటే మహారాష్ట్రలోని మోడ్నింబ్ రైల్వే స్టేషన్‌లో దిగి బస్సులో వెళ్లొచ్చు. పూణే విమానాశ్రయంలో దిగి.. క్యాబ్‌ను అద్దెకు తీసుకొని షెట్‌పాల్‌కి వెళ్లొచ్చు.
Also read : Snake: ఈ పాము కరిస్తే కంటిచూపు మాటాష్!
30వేల పాముల రాతి చిత్రాలతో..
కేరళలోని అలప్పుజా జిల్లా హరిపాడ్‌లోని నాగ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. పిల్లలు లేని స్త్రీలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఈ పురాతన ఆలయంలో అత్యధిక సంఖ్యలో పాముల రాతి చిత్రాలు ఉన్నాయి. ఆలయం లోపల, చుట్టుపక్కల 30000 కంటే ఎక్కువ పాముల రాతి చిత్రాలు ఉండటం విశేషం.