Site icon HashtagU Telugu

Snake Appeared In An In-Flight Meal: విమాన భోజనంలో పాము తల.. వివరాలోకివెళ్తే..

Snake Head

Snake Head

సాధారణంగా మనం తిని ఆహారంలో రాళ్లు పడితే వాటిని తీసేసి తింటూ ఉంటాం. అటువంటి ఆహారంలో ఏకంగా బల్లి, బొద్దింక లేదంటే ఇతర కీటకాలు కనిపించాయి అంటే ఇక అంతే సంగతులు. హోటల్లోకి వెళ్లినప్పుడు అక్కడ భోజనంలో బద్దింక బల్లిలు కనిపించాయి అని అటువంటి హోటలను సీజ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి భోజనం ఆర్డర్ చేయగా అందులో ఏకంగా పాము తల కనిపించడంతో అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టర్కీ విమానయాన సంస్థ సన్ ఎక్స్ ప్రెస్ కు చెందిన ఓ విమానం ఈ నెల 21న అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ కు వెళ్తోంది.

అయితే విమానం గాల్లో ఉండగా, సిబ్బంది భోజనానికి ఉపక్రమించారు. అందులో ఒకరు భోజనం చేస్తుండగా, కూరలో పాము తల కనిపించడంతో బిత్తర పోయారు. ఆకు కూరలతో తయారుచేసిన కూరలో ఏకంగా పాము తల కనిపించిందట. ఈ భయంకరమైన అనుభవం ఫ్లయిట్ అటెండెంట్ కు ఎదురైంది. మామూలుగా తినే ఫుడ్ లో బల్లులు, బొద్దింకలు అప్పుడప్పుడు కనిపిస్తేనే హడలిపోతూ ఉంటారు. అటువంటిది పాము తల కనిపించడంతో ఆ అటెండెంట్ పరిస్థితి వర్ణాతీతం. ఈ ఘటనను సన్ ఎక్స్ ప్రెస్ విమానయాన సంస్థ తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే ఆహార సరఫరా కంపెనీతో కాంట్రాక్టును సస్పెండ్ చేసింది.

అనంతరం ఈ విషయంపై వివరణ ఇస్తూ.. గడిచిన గత మూడు దశాబ్దాలుగా తమ విమానాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని వారు తెలిపారు. అయితే ఇప్పుడు పొరపాటున ఏదో అనుకోకుండా జరిగిందని ఇక పై అలాంటివి జరగకుండా మునుపటిలాగే అదే లక్ష్యంతో ముందుకెళతామని సంస్థ తెలిపింది. ఇలాంటి పొరపాట్లను తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.

Exit mobile version