Green Sky:అమెరికాలో వింత.. ఆకుపచ్చగా మారిన ఆకాశం.. వైరల్ ఫోటోలు!

మామూలుగా మనకు ఆకాశం చాలా వరకు నీలి రంగులోనే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉదయం, సాయంత్రం సూర్యాస్తమయం,సూర్యోదయం సమయంలో ఆకాశం కాస్త ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 8, 2022 / 06:30 AM IST

మామూలుగా మనకు ఆకాశం చాలా వరకు నీలి రంగులోనే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉదయం, సాయంత్రం సూర్యాస్తమయం,సూర్యోదయం సమయంలో ఆకాశం కాస్త ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వర్షం కురిసే సమయంలో నల్ల రంగులోకి మారుతూ ఉంటుంది. అయితే మరి ఎప్పుడైనా ఆకాశం పచ్చ రంగులోకి మారడం చూశారా. ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారడం ఏంటి అని అనుకుంటున్నారా?మీరు విన్నది నిజమే.. తాజాగా అమెరికాలోని దక్షిణ డకోటాలో ఆగ్నేయం దిశగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం ఆకుపచ్చ రంగులో కనిపించడం ప్రస్తుతం స్థానికంగా అంశంగా మారింది.

అయితే ఎప్పుడు లేనిది ఆకాశం ఇలా ఎందుకు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది అని అక్కడి ప్రజలు అర్థం కాక షాక్ అవుతున్నారు. ఇది అందుకు సంబంధించిన దృశ్యాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే సినిమాలలో కొన్ని సన్నివేశాలలో చూపించినట్టుగా రాబోయే భయానక ఘటనలకు ఇది సంకేతమా అంటూ కొందరు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రజలు అనుకుంటున్నట్టుగా అక్కడ అలాంటిది ఏమీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆకాశం ఆకుపచ్చ రంగులో కనిపించడం అనేది సాధారణమైన విషయమే అని వాళ్ళు చెబుతున్నారు.

అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ నీటి శాతం ఎక్కువగా ఉన్న మేఘాల కారణంగా సూర్యకిరణాలు వక్రీకరణం చెందడం వల్ల ఇలా జరుగుతుంది అని శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. వక్రీకరణం వల్ల సప్తవర్ణ కిరణాలు కొన్ని రంగులే భూమికి చేరుతాయని తెలిపారు. భూమికి చేరే కిరణాలను బట్టి ఆకాశం ఆయారంగుల్లో కనిపిస్తుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. అదేవిధంగా ఆకుపచ్చ రంగులో ఆకాశం ఉంది అంటే వడగళ్ల వాన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి అనేది శాస్త్రవేత్తలు అంచనా. ఏది ఏమైనాప్పటికీ ఈ ఆకుపచ్చ ఆకాశం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది.