Six-Seater Bike: ఈ ‘బుల్లి బైక్’ కు ఆనంద్ మహీంద్రా ఫిదా!

వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా పోస్టులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది.

  • Written By:
  • Updated On - December 2, 2022 / 05:59 PM IST

వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా పోస్టులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. క్రియేటివిటీ వీడియోలు, ఆసక్తికరమైన విషయాలను ప్రజలకు తెలియజేస్తుండటం ఇందుకు కారణం. అందుకే ఆయనను ఫాలో అవుతున్న నెటిజన్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ షేర్ చేసిన ఈ పోస్టు అందర్నీ ఆకర్షిస్తోంది.

గ్రామీణ యువకుడు మల్టీ రైడర్ సైకిల్ ఇ-రిక్షాను తయారుచేసి ఆశ్చర్యపర్చాడు. ఇది సిక్స్-సీటర్ వాహనం. విద్యుత్ తో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీల వరకు ప్రయాణించవచ్చు. ఈ వాహనాన్ని తయారుచేసేందుకు మొత్తం రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి 10 రూపాయలు తీసుకుంటూ, వాహనాన్ని గ్రామంలో నడిస్తున్నాడు.

“కేవలం చిన్న డిజైన్ ఇన్‌పుట్‌లతో ఈ వెహికల్ అద్భుతంగా ఉంది. రద్దీగా ఉండే యూరోపియన్ పర్యాటక కేంద్రాల్లో టూర్ ‘బస్సు’లా ఉంది. నేను ఎల్లప్పుడూ గ్రామీణ రవాణా ఆవిష్కరణలకు ఆకర్షితుడ్ని అవుతాను” అని అన్నాడు 67 ఏళ్ల వ్యాపార దిగ్గజం. ప్రస్తుతం ఈ వీడియో 781k వ్యూస్ తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.