Sea Creature: సముద్రంలో విచిత్రమైన జీవి.. టైటానిక్‌ను కనుకున్న నౌకే దీన్ని కూడా?

సముద్రాలు,మహాసముద్రాల అడుగుభాగాలలో ఎన్నో రకాల జీవులను నివసిస్తూ ఉంటాయి. అయితే అందులో ఇప్పటికే

  • Written By:
  • Updated On - July 19, 2022 / 03:58 PM IST

సముద్రాలు, మహాసముద్రాల అడుగుభాగాలలో ఎన్నో రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. అయితే అందులో ఇప్పటికే కొన్నింటిని మన శాస్త్రవేత్తలు గుర్తించగా ఇంకా శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని జీవులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకదానిని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన నౌక ఈవి నౌటలీస్ శాస్త్రవేత్తలు తాజాగా పసిఫిక్ మహాసముద్రంలోని జాన్ స్టన్ అటోల్ ప్రాంతంలో సీ పెన్ అనే జీవిని గుర్తించారు. సముద్రపు అడుగు భాగాలలో కనిపించే అత్యంత అరుదైన జీవులలో ఈ సీ పెన్ అనే జీవి కూడా ఒకటి.

అయితే ఈ జీవి చూడడానికి ఆక్టోపస్ జాతికి చెందిన వాటిలా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఆక్టోపస్ జాతికి ఇవి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఇవి చూడటానికి పొడగాటి గొట్టం వంటి నిర్మాణంతో సముద్రపు అడుగు భాగానికి అతుక్కుని నీటి మధ్యలో తేలుతూ ఉంటాయి. ఇక ఆ జీవులకు ఉండే టెంటకిల్స్ తో ఆహారాన్ని పట్టుకోగలవు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జీవి సముద్రపు అడుగుకు అతుక్కుని ఉంటూ రెండు మీటర్ల పొడవైన స్టాక్ తో వేలాడుతూ ఉంటుంది.

ఈ జీవికి 40 సెంటీమీటర్లు వెడల్పయిన టెంటకిల్స్ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించడం జరిగింది.  1914లో మంచుకొండను ఢీ కొట్టి మునిగిపోయిన టైటానిక్ నౌకను గుర్తించినది కూడా నౌటిలిస్ నౌక సహాయంతోనే. దీంతో పాటుగా సముద్రంలో మునిగిన ప్రఖ్యాత జర్మన్ యుద్ధ నౌక బిస్మార్క్ ను కూడా ఈ పరిశోధన నౌక శాస్త్రవేత్తలే గుర్తించడం జరిగింది. వీరు మహాసముద్రాలపై తిరుగుతూ అడుగున ఉన్నటువంటి విశేషాలపై పరిశోధనలు చేస్తూ ఉంటారు. కాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కేంద్రంగా ఉన్న ఓసియన్ ఎక్స్ ఫ్లోరేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నౌక నడుస్తోంది.