Site icon HashtagU Telugu

Shocking: పింఛన్ కోసం నరకయాతన, కంటతడి పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో!

Viral

Viral

స్వాతంత్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ భారత దేశ పల్లెల (Rural Villages) దుస్థితి ఏమాత్రం మారడం లేదు. సరైన రోడ్డు సౌకర్యం, వైద్య (Health) వసతులు లేకపోవడంతో ఎంతో మంది పేదలు (Poor) ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా అత్యవసర వైద్యం చేయించుకోవాలంటే సైకిళ్లపైనే వెళ్లాల్సి వస్తోంది. డోలీ సాయంతో కిలోమీటర్లు నడిచి వైద్యం పొందిన సందర్భాలున్నాయి. చివరకు చనిపోతే డెడ్ బాడీ తరలించాలన్నా ఇబ్బందులే.

ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలు (Senior Citizen) తన పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లేందుకు విరిగిన కుర్చీతో చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియా (Social media)లో వైరల్ అవుతోంది. సూర్య హరిజన్ అనే మహిళ వయసు 70. ప్రతి నెలా ఫించన్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఈ సంఘటన ఒడిశాలోని ఝరిగావ్ లో జరిగింది. చెప్పులు లేకుండా విరిగిన కుర్చీ సాయంతో వెళ్లే వీడియో పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read: Summer Care: సమ్మర్ లో స్విమ్మింగ్ చేస్తున్నారా.. అయితే వీటితో జర జాగ్రత్త!